బాబా రాందేవ్ సమర్పించు…పతంజలి జీన్స్

baba ramdev jeans

బాబా రాందేవ్ సమర్పించుపతంజలి జీన్స్ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలీ సంస్థ మార్కెట్‌లోకి సరికొత్త ప్రొడక్ట్‌ ను తీసుకొస్తోంది. వస్త్ర వ్యాపారంలో యువతకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పతంజలి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ‘స్వదేశీ జీన్స్‌’ను వచ్చే ఏడాది మర్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. డ్రస్ మార్కెట్‌లో కూడా అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే పతంజలి ఈ నిర్ణయం తీసుకుందని రాందేవ్ బాబా స్వయంగా నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.

వ‌స్త్ర‌ వ్యాపారంలో ఇదొక కొత్త ఒర‌వ‌డితోపాటు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వార్త వస్త్ర వ్యాపార వర్గాల్లో కలవరం రేపింది. సంస్థ 50 లక్షల కోట్ల రూపాయలను టార్గెట్‌ గా పెట్టుకుందని రాందేవ్ చెప్పారు. ఈ వ్యాపార విస్తరణ ఒక్క భారత్‌ లోనే కాదు, భవిష్యత్‌లో పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ వంటి దేశాల్లో కూడా అడుగు పెట్టేందుకు సంస్థ ప్రయత్నించనుందని సమాచారం. అయితే ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో తమ సంస్థ యూనిట్లు ఉన్నట్టు ఆయన తెలిపారు.

ప్రస్తుతం సంస్థకు హరిద్వార్‌లో అతిపెద్ద యూనిట్ ఉందని, అయితే ఇప్పుడు నాగ్‌పూర్‌లో వెయ్యి కోట్ల రూపాయిలతో అంతకన్నా పెద్ద సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు రాందేవ్ బాబా తెలిపారు. నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌ను అందించేంద‌కు ప‌రిశోధ‌కుల‌తో రీసెర్చ్,డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు బాబా రాందేవ్ స్ప‌ష్టం చేశారు

Related posts:
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
తాగుబోతుల తెలంగాణ!
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
గుజరాత్ సిఎం రాజీనామా
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
ఆట ఆడలేమా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ఏపీ బంద్.. హోదా కోసం
వాళ్లను వదిలేదిలేదు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
బెంగళూరుకు భంగపాటే
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
500 నోటుపై ఫోటో మార్చాలంట
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
పాపం.. బాబుగారు వినడంలేదా?
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments