కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా

Bacteria in Krishna Water

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల శోభ సంతరించుకుంది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం కేసీఆర్ ఈ తెల్లవారు జామున పుష్కరస్నానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పుష్కరాలకు తగిన ఏర్పాట్లను చేశారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో భక్తులు ఎంతో భక్తితో పుష్కర స్నానాలు చేస్తారు. కోట్లాది భక్తజనం.. నదీమ తల్లికి నీరాజనం అర్పిస్తారు.  కానీ పుణ్య స్నానాలతో పాటు అక్కడి కాలుష్యం పుష్కర పుణ్యానికి అడ్డుపడుతోంది. పుష్కర ఘాట్లలో కాలుష్యనివారణ మండలి సేకరించిన నీటి శాంపిల్స్ లో ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి

ఎంతో ఘనంగా జరిగే కృష్ణా పుష్కరాల్లో భాగంగా భక్తుల స్నానాలు ఆచరించేందుకు ఘాట్లను ఏర్పాటు చేశారు. అయితే  అందులో  7 ఘాట్లలో  పీసీబీ నిరంతర నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపింది.  7 ఘాట్లలోని  నీరు సి క్యాటగిరిలో  ఉందని ఎట్టి  పరిస్థితుల్లో ఆ నీటిని నోట్లో పోసుకోవద్దని  పీసీబీ అధికారులు సూచిస్తున్నారు. పుష్కర నీటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఈ నీటిలో ఎక్కువ సమయం  గడిపినా.. నీళ్లు శరీరంలోకి చేరినా జ్వరాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పుష్కరాలకు వారం ముందు  వ్యాక్సిన్ తీసుకుంటే కానీ ప్రయోజనం  ఉంటుందంటున్నారు

పుష్కరస్నానాల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ ల వద్ద ప్రతి మూడు గంటలకు ఒకసారి 13 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నీటి నమూనాల్లో తేడా వచ్చింది అనిపిస్తే వెంటనే అధికారులను, భక్తులను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలకు ఉపక్రమించింది. మొత్తంగా పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో…పుష్కరాలకు వెళ్లే భక్తులు పర్యావరణానికి హాని కలిగించే వస్తువలను వెంట తీసుకెళ్లకూడదని ఆదేశిస్తున్నారు. కాబట్టి భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ పుష్కర స్నానం చెయ్యడం మంచిది. చిన్న పిల్లలు, ముసలివారు, గర్భవతులు కాస్త ఎక్కువ జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
హరీష్.. ఇది నీకు సరికాదు
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
పిహెచ్‌డి పై అబద్ధాలు
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
గెలిచి ఓడిన రోహిత్ వేముల
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ట్రంప్ సంచలన నిర్ణయం
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments