బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య

Balakrishna rides bullet in Hindupur on nara Brahmini survey

ఏపిలో పరిస్థితులు మారుతున్నాయి. ఎన్నికలు వస్తే అధికారంలోకి మనుషులు కూడా మారతారు అని దాదాపుగా తేలిపోయింది. నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఒకరిగా మారిన నారా బ్రాహ్మణి.. వల్ల నందమూరి బాలయ్య నష్టనివారణ చర్యలకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. అవును.. తన తండ్రి నందమూరి బాలకృష్ణకు నారా బ్రాహ్మణి ఇచ్చిన షాక్ తో ఏకంగా బాలయ్య బాబు బుల్లెట్ తో చక్కర్లు కొడుతున్నారట. అలా ఎందుకు..? అయినా నారా బ్రాహ్మణి వల్ల బాలయ్య బుల్లెట్ ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

నందమూరి బాలకృష్ణ ఉన్నట్టుండి తన నియోజక వర్గ పర్యటనకు బయలుదేరారు. మూడు రోజులుగా నందమూరి బాలయ్య హిందుపురంలో తెగ హడావిడి చేస్తున్నారు. నందమూరి బాలయ్య ఇంతలా హడావిడి చెయ్యడానికి అసలు కారణం నారా బ్రాహ్మణి అని తెలుస్తోంది. అవును నారా బ్రాహ్మణి వల్ల బాలయ్య బుల్లెట్ మీద హిందుపురం మొత్తం కలియతిరుగుతున్నారు అని తెలుస్తోంది. ఇంతకీ దీని వెనక ఉన్న కారణం ఏంటి అనుకుంటున్నారా..? నారా బ్రాహ్మణి నిర్వహించిన ఓ సర్వే. తెలుగుదేశం భవితవ్యం మీద బ్రాహ్మణి సర్వే దెబ్బకు బాలయ్య బుల్లెట్ ఎక్కాడని తెలుస్తోంది.

తాజాగా నారా బ్రాహ్మణి నిర్వహించిన సర్వేలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి కేవలం 57 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. దాంతో నారా బ్రాహ్మణి పార్టీ పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రిపోర్ట్ చేసిందని తెలిసింది. కాగా ఈ రిపోర్ట్ లో తన తండ్రికి కూడా షాకింగ్ అంశాలున్నాయని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఇప్పటికే హిందుపురంలో బాలయ్య మీద వ్యతిరేకత ఏర్పడింది. హిందుపురం వాసుల కోసం బాలయ్య చేసిందేమీ లేదని, ఎన్నికలు జరిగితే బాలయ్యకు కనీసం డిపాజిట్లు కూడా దక్కడం కష్టమే అని ప్రచారం జరుగుతోంది. దాంతో నష్టనివారణ చర్యలకు దిగారు బాలయ్య. హిందుపురంలో గత మూడు రోజుల నుండి పలు కార్యక్రమాలకు హాజరవుతూ, కార్యకర్తలతో, ప్రజలతో కలియతిరుగుతున్నారు. అయితే ఒకటి రెండు రోజులు బాలయ్య మెరుపు పర్యటన చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని విశ్లేషకుల భావన. మొత్తానికి బాలయ్యకు మాత్రం నారా బ్రాహ్మణి సర్వే షాకిచ్చింది. మరి చూడాలి ఈ ప్రభావం ఎంత వరకు ఉంటుందో.

Related posts:
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
బాబుగారి చిరు ప్లాన్
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments