బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది

Band effects in AP for Special Status

Bandh effects in AP for Special Status.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తు ప్రతిపక్షపార్టీ వైసీపీ పిలుపునిచ్చిన ఏపి బంద్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఏపిలోని 13 జిల్లాల నుండి అన్ని పార్టీల నాయకులు బంద్ కు స్వచ్ఛందంగా ముందుక వచ్చారు. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్ప మిగిలిన వాళ్లందరూ కూడా బంద్ లో పాలుపంచుకున్నారు. గుంటూరు,విజయవాడ, విశాఖపట్నంలాంటి అన్ని మేజర్ నగరాల్లో బంద్ ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపించింది. బస్సులు రోడ్డెక్కలేదు.. విద్యా సంస్థలు బంద్ నుపాటించాయి.

పార్లమెంట్ సాక్షిగా ఏపికి ప్రత్యేక హోదా కుదరదు అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చెయ్యడంతో ఆంధ్రులు కోపంతో రగిలిపోయారు. మరోసారి సమైక్యాంధ్ర ఉద్యమ స్పూర్తి కనిపించింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాటలపై కూడా బంద్ సందర్భంగా వ్యతిరేకత వ్యక్తమైంది. వెంకయ్య నాయుడు దిష్టిబొమ్మలను అక్కడక్కడ కాల్చేశారు. కాగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంతో పాటు ఏపి ముఖ్యమంత్రి మీద కూడా వ్యతిరేకత మొదలైంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు కేంద్రం మీద అవసరమైన వత్తిడి చెయ్యలేకపోతున్నారని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

ఏపిలో వస్తున్న ప్రజా వ్యతిరేకతను గ్రహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ వేదికగా ఎంపీల చేత ధర్నా నిర్వహించినా కూడా దాని వల్ల వచ్చింది మాత్రం ఏమీలేదు. దాంతొ క్షేత్రస్థాయి ఏపికి ప్రత్యేక హోదా విషయంలో మోదీ మీద ఎంత వ్యతిరేకత ఉందో చంద్రబాబు నాయుడు మీద అంతే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు జగన్ పార్టీ ఇచ్చిన బంద్ ను లైట్ గా తీసుకున్నా గానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా బంద్ అనుకోని విధంగా సక్సెస్ అయింది. కాగా కొన్ని మీడియాలు మాత్రం బంద్ పాక్షికం అని వార్తలను ప్రసారం చేస్తున్నాయి. కాగా ఇప్పుడు ఏపిలో పరిస్థితి ఓ పార్టీ నియంత్రించే పరిస్థితి దాటేలా కనిపిస్తున్నాయి.

నాడు సమైంక్యాంధ్ర ఉద్యమం మొదలైనప్పుడు ఏ పార్టీ కూడా దాన్నినియంత్రించే పరిస్థితి ఎలా అయితే లేదొ ఇప్పుడు కూడా మరికొద్ది రోజుల్లో అలాంటి పరిస్థితి వచ్చేలా కనిపిస్తున్నాయి. జగన్ పార్టీ పిలుపునిచ్చింది అన్న కోణంలో కాకుండా పార్లమెంట్ సాక్షిగా ఏపికి మరోసారి అన్యాయం జరిగింది అన్న కోణంలో చాలా మంది స్పందిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇలానే ఏపికి ప్రత్యేక హోదాపై డైలమా కొనసాగితు మాత్రం పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇప్పటికే చంద్రబాబు నోరు బంద్ అయింది. ఏపి ప్రజలతో పెట్టుకున్నందుకు మోదీకి కూడా మూడింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్, మోదీలు ఎవరి బాటలో ఎలా ఆలోచిస్తారు అనేది చూడాలి.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
ఉక్కిరిబిక్కిరి
చంద్రుడి మాయ Diversion Master
అన్నదమ్ముల సవాల్
పట్టిసీమ వరమా..? వృధానా..?
మూడింటికి తేడా ఏంటి..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ప్రత్యేక హోదా లాభాలు
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మెరుపు దాడి... నిజమా-కాదా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
పిట్టల దొరను మించిన మాటల దొర
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments