బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్

Bank employees beaten by mob in Allahabad

దేశంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో తాను చేస్తున్న మహత్తర యుద్ధంలో కొన్ని ఇబ్బందులు తప్పవు అని దేశ ప్రజలకు వివరించారు. యాభై రోజుల వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పవు అని అన్నారు. అయితే మోదీ నాటి నిర్ణయానికి చాలా మంది సమర్థించినా కానీ పరిస్థితులు మారడంలో సీన్ మారింది. మోదీని ఇప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే బాహుబలి సినిమా స్టైల్లో బ్లాక్ బలి అని తెలుగు మీడియాలో పెద్ద పెద్ద టైటిల్స్ తో రాసినా కానీ చివరకు మాత్రం ప్రజలే బలయ్యారు. ఇప్పుడు ఏకంగా బ్యాంకోళ్లు బలవుతున్నారు. బలి అవడం అంటే మామూలుగా కాదు.. ఏకంగా బలిత దెబ్బలు కాయాల్సి వస్తోంది.

పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి న‌ల‌భై రోజులు దాటిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో దేశ వ్యాప్తంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిత్యావ‌స‌ర స‌రుకులు కొనుక్కోవ‌డానికి కూడా డ‌బ్బు లేక‌పోవ‌డంతో తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో నిల‌బ‌డినా కొన్ని చోట్ల డ‌బ్బులు దొర‌క‌క‌పోతుండ‌డంతో వారిలో ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. అలహాబాద్ లో బ్యాంకు అధికారులకు, ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యాంకు బయట రోడ్డుపైనే అధికారులు, ప్రజలు ఒక్కరినొక్కరూ కొట్టుకున్నారు. ఇద్దరు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులను తీవ్రంగా చితక్కొట్టారు. డబ్బులు ఇవ్వకుండా పదేపదే తిప్పించుకుంటున్నారని ఆగ్రహంతో ప్రజలు మండిపడ్డారు. ఇలా మోదీ దెబ్బకు ప్రజలు బలి.. బ్యాంకులోళ్లు కూడా బలి అని తేలిపోయింది కదా?!

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
ఆట ఆడలేమా..?
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
‘స్టే’ కావాలి..?
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
స్టే ఎలా వచ్చిందంటే..
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
బాబు గారి అతి తెలివి
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
అకౌంట్లో పదివేలు వస్తాయా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
శోభన్ బాబుతో జయ ఇలా..
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
కేసీఆర్ మార్క్ ఏంటో?
బంగారం బట్టబయలు చేస్తారా?
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

Comments

comments