పైసలు వసూల్ కాలేదుగా..

banks did not get expected money by demonetisation effect

మోదీ డిమోనిటైజేషన్ నిర్ణయంతో(పెద్ద నోట్ల రద్దు) ఒక్కసారిగా కలవరం మొదలైంది. మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలుగులోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ డీమానిటైజేషన్ అనుకున్న లక్ష్యాల వైపు సాగుతోందా? బ్యాంకులకు అనుకున్న రేంజ్ లో డబ్బులు చేరిందా? మోదీ, ఆయన భజన బృందం బీరాలకుపోతున్నట్లు అనుకున్న వైపే అడుగులుపడుతున్నాయా? అంటే దాదాపుగా లేదనే సమాధానం వస్తోంది. మోదీ నిర్ణయం ఎలాంటిది అనే చర్చ పక్కనబెడితే ఆ నిర్ణయం ప్రభావం ఎంత వరకు ఉంది అనే దానిపై ఇక్కడ క్లారిటీ దొరుకుతుంది. మొత్తం ఆర్టికల్ చదవండి మీకు కూడా తెలుస్తుంది.

భారత్ లో అవసరానికి తగిన మనీ ఉంది. నిజానికి బ్లాక్ మనీ కూడా మన దగ్గర బాగా ఉంది. అయితే మొత్తం భారతదేశం వద్ద 16 లక్షల కోట్ల నగదు ఉంది. అందులో 85 శాతం అంటే 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. అయితే మోదీ తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం 500, 1000 నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి మొత్తంగా రాకున్నా ఓ నాలుగు లక్షలు తగ్గి కనీసం 10 లక్షల కోట్లు అయినా వస్తుంది అని మోదీ సర్కార్ అంచనా వేసింది. ఆ మిగిలిన డబ్బును భారత ప్రభుత్వం ప్రింట్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఇప్పటి వరకు 5.12 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని ఆర్బీఐ తేల్చింది. ఈ లెక్కన గత 15 రోజుల నుండి డిపాజిట్ అయిన మొత్తం కేవలం 5.12 లక్షల కోట్లు మాత్రమే. నిజానికి కేంద్రం వేసిన లెక్కలకు, వచ్చిన నగదుకు ఎక్కడా పొంతనలేకుండా ఉంది. అయితే డిసెంబర్ 30 వరకు ఉన్న గడువును మరింత పెంచినా కూడా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరేలా లేదు. అయినా మోదీ లెక్కలు వేయడంలో తప్పు జరిగింది అని మాత్రం క్లీయర్ గా అర్థమైంది. ఇప్పటికే నగదును సరఫరా చెయ్యడంలో విఫలమైన మోదీ సర్కార్ మరి భవిష్యత్తులో అడుగులు ఎలా వేస్తుందో చూడాలి.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ చంద్రుడి చక్రమే
చంద్రుడి మాయ Diversion Master
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
వెనకడుగు
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
మీకో దండం.. ఏం జరుగుతోంది?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

Comments

comments