చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!

Song-while-Babu-speech-new

చంద్రబాబు నాయుడు అంటే ఓ క్రమశిక్షణ.. ఓ పద్దతి. ఆయన ఎక్కడున్నా వాటిని మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. మరి అలాంటి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతుంటే.. ఓ పాట వినిపించింది. ఆ పాట ఆ సందర్భానికి అస్సలు సూట్ కాని పాట. మామూలుగా అయితే ఆ పాటను మస్తీ చేసే టైంలో మాత్రమే వాడతారు. అలాంటి గవర్నర్ పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ పాట వినిపించడం చంద్రబాబుకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. ఇంతకీ ఏంటీ ఆ పాట అనుకుంటున్నారా..? ‘‘బావలు సయ్యా’’

అమరావతిలోని వెలగపూడి సచివాలయం వద్ద చంద్రబాబు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న వేళ మైకుల్లో “బావలు సయ్యా…” పాట పెద్దగా వినిపిస్తుండటం ఆయనకు అసహనాన్ని కలిగించింది. గవర్నర్ నరసింహన్ తో కలసి వెలగపూడికి వచ్చిన ఆయన, భవనాల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకుని, వేద పండితులను, మేళతాళాలను, మైక్ సెట్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ మైక్ సెట్ నుంచే ఈ పాట వినిపించినట్టు తెలుస్తోంది. సీఎం ప్రసంగానికి అడ్డుతగులుతున్న పాటలను ఆపాలని అధికారులు పదే పదే కోరాల్సి వచ్చింది. సీఎం ప్రసంగాన్ని లైవ్ చూపిస్తున్న పలు చానళ్లు ఈ పాట వస్తుండటంతో సౌండును ‘మ్యూట్’ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఎక్కడో చేసిన చిన్న పొరపాటు చంద్రబాబును ఇరుకున పెట్టింది.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
సైన్యం చేతికి టర్కీ
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
జియోకు పోటీగా ఆర్‌కాం
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
BSNL లాభం ఎంతో తెలుసా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
అవినీతి ఆరోపణల్లో రిజిజు
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
పాపం.. బాబుగారు వినడంలేదా?
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్

Comments

comments