బావర్చి హోటల్ సీజ్

Bawarchi Hotel seized in Hyderabad

హైదరాబాద్ బిర్యాని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి. ఎవరైనా మన బిర్యానిని లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఐతే ఇంత ఫేమస్ బిర్యానిని ఎంత పరిశుభ్రంగా తయారు చేస్చున్నారన్నదే ప్రశ్నార్ధకం. హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్న బావర్చి హోటల్‌ పై మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, కొంత మంది శానిటరీ అధికారులు కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. హోటల్ పరిస్థితిని గమనించిన మునిసిపల్ సిబ్బంది దాన్ని సీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. వెంటనే అనుకున్నది చేశారు.

బావర్చి హోటల్‌ వెనుక వైపు గల మ్యాన్‌ హోల్‌(Man Hole) నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.నిన్న అర్దరాత్రి మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్‌ వెనుక ఉన్న మ్యాన్‌ హోల్‌ ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. అధికారులు ఆ హోటల్‌ కిచెన్‌ ను పరిశీలించారు. కిచెన్‌ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్‌ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్‌ను సీజ్‌ చేశారు.

Related posts:
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
వీళ్లకు ఏమైంది..?
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
స్టే ఎలా వచ్చిందంటే..
పోరాటం అహంకారం మీదే
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాబు గారి అతి తెలివి
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?

Comments

comments