బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ

Chandra-babbabu

బతకలేక బిచ్చగాళ్లుగా మారడం గురించి అందరికి తెలుసు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, బస్టాండుల్లో, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీళ్లు కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఏపి సిఎం చంద్రబాబు కు, సర్కార్ కు తలనొప్పిగా మారారు ఈ బిచ్చగాళ్లు. ఇప్పటికే ఉన్న సమస్యలతో తలపట్టుకున్న చంద్రబాబుకు ఇప్పుడు బిచ్చగాళ్ల బెడద కూడా ఎక్కువైంది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సిఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా మంది బిచ్చగాళ్లను అధికారులు వాహనాలు పెట్టి మరీ హైదరాబాద్ నుండి దూరంగా తీసుకెళ్లడం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు విజయవాడలో బిచ్చగాళ్ల సమస్య చంద్రబాబు దృష్టికి చేరడంతో మరోసారి బిచ్చగాళ్ల ప్రస్థావన వచ్చింది. మొత్తానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఏపిలో బిచ్చగాళ్లకు చంద్రబాబు సిఎం ఐతే ఏదో రిలేషన్ ఉన్నట్లు అనిపిస్తోంది.

తాజాగా విజయవాడకు వచ్చిన చైనా బృందానికి బిచ్చగాళ్లు చుక్కలు చూపించారు. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ కోసమని విజయవాడ వచ్చిన వారికి బిచ్చగాళ్లు తమ ప్రతాపాన్ని చూపించారు. సిగ్నల్ దగ్గర వీళ్ల కారు ఆగగానే.. వెంటనే బిచ్చగాళ్లు బిచ్చం కోసం ఎగబడ్డారు. దాంతో దయతలిచి బిచ్చగాళ్లకు 500లు వేశారు. ఆ విషయం నెక్ట్స్ సిగ్నల్ కు వాళ్ల కారు చేరక ముందే బిచ్చగాళ్ల బ్యాచ్ కు తెలిసింది. అలా అన్నిసిగ్నల్స్ దగ్గర చైనా బృందానికి బాబ్బాబు అంటూ చుక్కలు చూపించారు. చైనా బృందంతో చంద్రబాబు మీటింగ్ ముగిసిన తర్వాత బిచ్చగాళ్ల బెడద లేకుండా చెయ్యండి బాబు అంటూ చైనా సభ్యులు మాట్లాడినట్లు తెలిసింది.

బిచ్చగాళ్ల బెడద అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా విజయవాడలో అయితే మరీ మితిమీరింది. సిగ్నల్స్ దగ్గర కారు ఆగితే చాలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై స్పందించినట్లు తెలిసింది. వాళ్ల గురించి ఏదో పరిష్కార మార్గాన్ని చూస్తామని అన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించాలి. కానీ అది జరగడం లేదు కాబట్టే ఇంత మంది రోడ్ల మీద బిచ్చమెత్తుకుంటున్నారు. చంద్రబాబు నాయుడులాంటి రాజకీయ మేధావి ఇదే బిచ్చగాళ్లను అభివృద్ధి కోసం మ్యాన్ పవర్ గా కూడా మలుచుకునే అవకాశం ఉంది. వారికి ఏదో ఒక అంశంలో శిక్షణ ఇచ్చి.. వారి ద్వారా సంపాదనను పెంచవచ్చు.

బిచ్చగాళ్లకు మరో కోణం కూడా ఉంది. ఏళ్లకు ఏళ్లు ఒకే సిగ్నల్ లేదా జంక్షన్ వద్ద వారు పాతుకుపోతున్నారు. పది నుండి పాతిక సంవత్సరాలు వచ్చినా.. పిల్లలు పుడతూ ఉన్నారు కానీ వారు చేసే పనిలో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు. ఇక ఇందులో కనిపించని మరో కోణం ఏంటంటే. మాఫియా. అవును బిచ్చగాళ్ల ద్వారా వచ్చే ఆదాయం కోసం కూడా మాఫియా పని చేస్తోంది. అందులో భాగంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి చిన్న పిల్లలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. రోజుకు రెండు వందల నుండి ఐదు వందల వరకు అద్దె చెల్లించి.. బిచ్చగాళ్లు వాళ్లను అడ్డంపెట్టుకొని సంపాదిస్తున్నారు. ఆ చిన్న పిల్లలు నిద్రపోవడానికి అంటూ మెడిసిన్లు కూడా ఇస్తుంటారని తెలిసింది. విజయవాడలో బిచ్చగాళ్ల బెదడ గురించి స్థానికులను ఎవరిని అడిగినా చెబుతారు. కానీ పక్క దేశం వాడు వచ్చి.. దీనిపై స్పందించిన తర్వాత కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదు.

దీనిపై ప్రతిపక్ష పార్టీలను అడిగితే వాళ్లు చెప్పే రాజకీయ కోణం వింటే షాక్ తింటారు. చంద్రబాబు నాయుడు అమరావతి అంటూ.. రాజధాని అంటూ ఉన్న భూములు లాక్కొని పరిహారం ఇవ్వకుండా కూర్చుంటే భవిష్యత్ లో మరింత మంది బిచ్చగాళ్లుగా మారి.. చంద్రబాబుకు చుక్కలు చూపించడం ఖాయం అని వారు అంటున్నారు. బాబు వస్తే బాబు వస్తుంది అని అప్పట్లో ప్రచారం చేసుకున్న చంద్రబాబు అండ్ టీం మరి అంతకంతకు పెరిగిపోతున్న బిచ్చగాళ్ల సంఖ్యను చూసి ఏం సమాధానిమిస్తుంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది పూర్తిగా రాజకీయ కోణమే అయినా అందులో కూడా ఎంతో కొంత నిజమైతే ఉంది. మరి బిచ్చగాళ్ల బెడదను చంద్రబాబు నాయుడు సర్కార్ ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అనేది చూడాలి.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
సింధూరంలో రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
ఉక్కిరిబిక్కిరి
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
ఇక యుద్ధమే కానీ..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
మోదీ భజన అందుకేనా?

Comments

comments