ప్రత్యేక హోదా లాభాలు

Benefits with Special Status for Andhra Pradesh

Benefits with Special Status for Andhra Pradesh. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

బిజెపి ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం, టిడిపి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేశారు అన్న భావన వచ్చేసింది. అటు కేంద్ర ప్రభుత్వనేతలు ప్రత్యేక హోదా కంటే మెరుగైన ప్యాకేజ్ SAM(Special Assistance Measure) రూపంలో ఇచ్చామని చెప్పకుంటుంటే.. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వల్ల బెనిఫిట్స్ ఏంటని తెలియనట్లు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

ప్రత్యేక హోదా అనేది మొదట మూడు రాష్ట్రాలు అస్సాం, నాగాలాండ్, జమ్ము కాశ్మీర్ లకు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఇది మరో ఎనిమది రాష్ట్రాలయిన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలకు ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది.

ప్రత్యేక హోదా వల్ల కలిగే అతి ముఖ్యమైన లాభాలు ఏమిటంటే..

కేంద్ర సహాయం 90: 10 నిష్పత్తిలో ఉంటుంది.
అంటే 90 శాతం గ్రాంటు రూపంలోనూ, మిగిలిన 10 శాతం అప్పు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీని వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు, రాష్ట్రాలు బయటి నుండి తెచ్చుకొనే నిధులకు కేంద్ర ప్రభుత్వమే 90 శాతం భరిస్తుందన్న మాట.
ఎక్సైజ్ మరియు కస్టమ్స్ డ్యూటీలపై, ఇన్కంట్యాక్స్(Income Tax), కార్పోరేట్ ట్యాక్స్ లపై భారీ రాయితీలు ఉన్నాయి.
దీని వలన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు భారీగా రాష్ట్రానికి తరలి వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలతో పాటు కొత్త కొత్త నైపుణ్యాలను రాష్ట్ర ప్రజలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది భావితరాల వారికి ఎంతో ఉపయోగపడతాయి అనడంలో అతిశయోక్తిలేదు.
రాష్ట్ర లోటు బడ్జెట్ ను తీర్చవలసి ఉంటుంది.
కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులు సమకేర్చడమే కాకుండా దీనికి సంబందించి రాష్ట్రానికి అవసరమైన వనరులను అభివృద్ధి పరిచి రాష్ట్ర లోటు బడ్జెట్ ను తగ్గుముఖం పట్టేలా కేంద్రం చేస్తుంది. ఒక రకంగా రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది.
కేంద్రం ఇచ్చే నిధులు వెనక్కివెళ్లవు.
అంటే ఏ కారణం చేతనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయని యెడల అవి తరువాత సంవత్సరం నిధులలో కలుస్తాయి. కానీ మళ్లీ వెనక్కి వెళ్లిపోవు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాజధాని లేకుండా ఏర్పడింది. కాబట్టి కేంద్ర నిధులు రాజధాని నిర్మాణానికి ఇవ్వవలసి ఉంటుంది.

మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదాతో రాష్ట్రం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావలసిన నిధులు, రాయితీలు ఎవరిని అడుక్కోకుండా, బ్రతిమాలకుండా వచ్చేస్తాయి.

Related posts:
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
ఆ అరుపులేంటి..?
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
అన్నదమ్ముల సవాల్
వెనకడుగు
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మెరుపు దాడి... నిజమా-కాదా?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

Comments

comments