బెంగళూరుకు భంగపాటే

Bengaluru city got second place after Hyderabad

తాటిని తన్నే వాడొకడుంటే.. వాడి తలతన్నేవాడొకడు ఉంటాడు అని అందరికి తెలిసిన నానుడి. అలాంటి పరిస్థితి మనలో చాలా మంది చూసే ఉంటారు. తాజాగా ఐటీ రంగంలో కూడా ఇదో జరుగుతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న సిటీ బెంగళూరు. తర్వాత హైదరాబాద్, పుణె, చెన్నై సిటీలు నిలుస్తాయి. కానీ ఇపుడిదంతా గతం.. లెక్కలు మారుతున్నాయి. ఈక్వేషన్స్ కింద మీద అవుతున్నాయి. దేశ ఐటీ రాజధానిగా కొనసాగుతోన్న బెంగళూరు ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకు హైదరాబాద్ దూసుకొస్తుంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనే ఆభరణాన్ని మెడలో వేసుకునేందుకు పరుగులు తీస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కేంద్ర వాణిజ్య శాఖ- ప్రపంచ బ్యాక్ సంయుక్తంగా ప్రకటించిన ఈవోడీబీ జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటక మాత్రం 13వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది వెల్లడించిన ర్యాంకుల్లో 9వ స్థానంలో నిలిచిన కర్ణాటక ఈసారి నాలుగు స్థానాలు దిగజారింది. ప్రస్తుతానికైతే ఐటీ ఎగుమతులు, సేవల్లో బెంగళూరు నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ ఈవోబీడీ ర్యాంకుల ప్రభావంతో అవకాశాలు చేజార్చుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు..! దీనికితోడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల భారీగా పెరిగిన అవినీతి, తద్వారా సంస్థలకు అనుమతులు మంజూరుచేయడంలో నెలకొన్న జాప్యం తదితర కారణాలు కూడా బెంగళూరుకు ప్రతికూలతలుగా మారాయి.

అంతే కాదు.. ప్రభుత్వంలో అనిశ్చితి, కావెరీ వివాదంపై రేగిన అల్లర్లు, ఇలా ప్రతీది ఐటీలో హైదరాబాద్ ది బెస్ట్ అనేలా చేస్తున్నాయి. టీ హబ్ ఏర్పాటుతో స్టార్ట్ అప్ లకు బూస్టివ్వడంతో, సర్కారు సహకారం ఇతర అంశాలు ఐటీ కంపెనీలను హైదరాబాద్ వైపు చూసేలా చేస్తున్నాయి. మొత్తంగా త్వరలోనే బెంగళూరు స్తానాన్ని హైదరాబాద్ చేజిక్కించుకోవడం ఖాయమంటున్నారు ఐటీ ఇండస్ట్రీ పెద్దలు.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
సింగ్ ఈజ్ కింగ్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
బినామీలు భయపడే మోదీ ప్లాన్
అమ్మ పరిస్థితి ఏంటి?
శోభన్ బాబుతో జయ ఇలా..
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
అప్పుడు చిరు బాధపడ్డాడట
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments