చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో

Bhumana facing enquiry on tuni incident

కాపుల రిజర్వేషన్ల కోసం మరోసారి ముద్రగడ పద్మనాభం అదే సామాజిక వర్గానికి చెందిన దాసరి, చిరంజీవిలతో కలిసి కాకినాడ వేదికగా సభకు సమాయత్తమవుతున్న తరుణంలో ఏపి సర్కార్ తుని ఘటనపై విచారణను స్పీడు పెంచింది. ఈ తరుణంలో తుని ఘటనపై సిఐబి భూమన కరుణాకర్ రెడ్డిని ఈ రోజు(06.09.2016) విచారించింది. తుని ఘటనలో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి గుంటూరులో విచారణకు హాజరయ్యారు.  ఆరు గంటల పాటు భూమనను విచారించింది సిఐడీ. దీనితో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేతలంతా ఇక్కడ మోహరించారు. చంద్రబాబుది కుట్రపూరిత ఆలోచన అని, అవినీతి కుంభకోణంపై జగన్ నిలదీయనున్నారని ఆ పార్టీకి చెందిన చెవిరెడ్డి పేర్కొన్నారు. దీనితో డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా ముద్రగడతో స్నేహం ఉంటుందని పేర్కొన్నారు.

తనను అప్రతిష్ట పాలుచేయడానికే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తుని ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న వారిని చంద్రబాబు శత్రువులుగా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. న్యాయబద్ధమైన కాపుల ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు భూమన. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని అయినా చట్టంపై గౌరవం ఉండడంతో విచారణకు హాజరయ్యానన్నారు. దురుద్దేశంతోనే సీఐడీ నోటీసులు ఇచ్చిందని కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.

ముద్రగడ పద్మనాభం నాడు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చమనే అడిగారని.. అందుకే తాము ఆయనకు అండగా ఉన్నామని.. ఇక మీదట కూడా తమ మద్దతు ఉంటుంది అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు కాపుల పట్ల బ్రిటిష్ అధికారి రూథర్ ఫర్డ్ లాగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఆనాడు ఏవిధంగా అయితే రూథర్ ఫర్డ్ మన్యం వాసులను కాల్చివేసినట్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నారని అన్నారు.

కాపులు, చంద్రబాబు నాయుడు మధ్య పరిస్థితి కప్ప పాములా మారిందని భూమన అన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతకీ కాపులను అణచివెయ్యాలనే అనుకుంటున్నారని.. అందుకే ఇలాంటి తప్పుడు విచారణలు జరుగుతున్నాయని అన్నారు. తుని ఘటన జరిగిన 8నెలల తర్వాత దానిపై విచారణ అంటూ నోటీసులు రావడం ఖచ్చితంగా రాజకీయమే అని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇలాంటి చిన్నాచితకా విచారణలకు బెదిరేదిలేదు అని భూమన స్పష్టం చేశారు. మొత్తానికి భూమన పై తుని ఘటన పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ మండిపడుతోంది. విచారణ తర్వాత భూమన ఏమాత్రం తొనుకుబెనుకులేకుండా మీడియాతో మాట్లాడటం గమనార్హం.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
జియోకే షాకిచ్చే ఆఫర్లు
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సౌదీలో యువరాజుకు ఉరి
అడవిలో కలకలం
అకౌంట్లో పదివేలు వస్తాయా?
అకౌంట్లలోకి 21వేల కోట్లు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
వార్దాకు వణికిపోతున్న చెన్నై
500 నోటుపై ఫోటో మార్చాలంట
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments