నయిం కేసులో పెద్ద తలకాయలు

Big shots in Nayeem case

నయీమ్ అక్రమాలు, ఆగడాలతో సంబంధం ఉందని ఇంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా సేకరించిన వాంగ్మూలాల ద్వారా గుర్తించామని హైకోర్టుకు సిట్ తెలిపింది. నయీమ్ కేసును సిబిఐకి అప్పగించాలంటూ సిపిఐ నేత కె. నారాయణ వేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సంద ర్భంగా నయీమ్ కేసులో ఇప్పటివరకు నేతి విద్యాసాగర్‌రావుతో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన మరోనేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డిలతో పాటు అదనపు ఎస్‌పిలు సాయిమనోహర్, మస్తాన్‌వలీ, మద్దిపాటి శ్రీనివాసరావు, సిఐ వెంకట్‌రెడ్డిలను కూడా విచారించామని కోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ పేర్కొంది.

పోలీసు కాల్పుల్లో నయీమ్ హతమైన తర్వాత ఆయన అరాచకా లు, భూ కబ్జాలు, వసూళ్ళపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పా టుచేసిన విషయం తెలిసిందే. నయీమ్ బాధితులు చాలా మంది సిట్‌ను ఆశ్రయించి తమకు ఎదురైన ఇక్కట్లు కలిగిన నష్టం తదితర వాటిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన సిట్ బృందాలు యాదాద్రి జిల్లా భువనగిరిలో కొంత మందిని విచారించాయి. ఇందులో కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారు.

గంగసాని రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు పేరుంది. అదే విధఁగా మధుకర్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో టిఆర్‌ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పేరు బయటకు వచ్చింది. వెలగపూడి శివరాం ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంలో డిఎస్పీ మద్దిలేటి శ్రీనివాసరావు, యూసుఫ్‌ఖాన్ వాంగ్మూలంలో డిఎస్పి మస్తాన్‌వలీ పేరు బహిర్గతమైంది. లకా్ష్మరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సిఐ వెంకట్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. వీటన్నింటినీ సిట్ కోర్టుకు తెలిపింది. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖుల పేర్లు కూడా సిట్ తీసుకున్న వాంగ్మూలంలో వెల్లడయ్యాయి. వీటన్నింటినీ త్వరలోనే కోర్టుకు తెలియజేసేందుకు సిట్ సన్నద్దమవుతోంది. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు 156 కేసులను నమోదు చేసి దాదాపు 100 మందిని అరెస్టు చేసింది. అయితే మొత్తం వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నందున విచారణ నిస్పక్షపాతంగా సాగుతుందా..? లేదంటే రాజకీయ వత్తిళ్లు పని చేస్తాయా..? అని తెలియాలి.

Related posts:
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments