మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం

Bihar-merit-Scam-new

దేశంలో ఎక్కువ క్రైమ్ నమోదయ్యే రాష్ట్రంగా బీహార్ కు ఓ చెడ్డ రికార్డు ఉంది. అక్కడ ప్రభుత్వం కన్నా కూడా ప్రభుత్వేతర శక్తులదే హవా అని అందరికి తెలుసు. అయితే తాజాగా అంతకు మించిన గోల్ మాల్ లు అక్కడ ఎన్నో జరుగుతున్నాయని తెలుస్తోంది. బీహార్ మెరిట్ కుంభకోణాన్ని చూస్తే దేశం మొత్తం ముక్కవేలేసుకుంటోంది. ఎందుకంటే ఎవరూ కూడా ఊహించని విధంగా ఈ కుంభకోణం జరిగింది. గత విద్యా సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను వెల్లడించింది అక్కడి ఎడ్యుకేషనల్ బోర్డ్. ఈ పరీక్షలకు ఆర్ట్, సైన్స్, కామర్స్ విభాగాల్లో దాదా పు 15లక్షల మంది విద్యార్థులు హాజర య్యారు. ఈ పరీక్షల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను మీడియా వాళ్లు ఇంటర్వూలు చేశారు. మీడియా అడిగిన ప్రశ్న లకు సమాధానాలు ఇవ్వడంలో వారు విఫల మయ్యారు. కొందరు అతితెలివి సమాధానాలు చెప్పడంతో వాళ్ల మ్యాటర్ ఏంటో తెలిసిపోయింది.

ఇంటర్ పరీక్షల్లో ఆర్ట్ విభాగంలో టాపర్‌గా నిలిచిన రుబీరాయ్‌ను మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానంతో అందరూ నవ్వుకోవాల్సి వచ్చింది. తాను రాజనీతి శాస్త్రం ద్వారా వంట ఎలా చేయాలో నేర్చుకున్నానని తెలివితక్కువగా సమాధానమిచ్చి, వివాదంలో చిక్కుకు పోయారామె. సైన్స్ విభాగంలో టాపర్ సౌరభ్ శ్రేష్ఠను అల్యూమినియం రసాయనిక చర్యపై అడిగిన ప్రశ్నకు అతను ఇచ్చిన సమాధానానికి మీడియా ప్రతినిధులు తెల్లముఖాలేయాల్సి వచ్చింది. పత్రిక ల్లో, ఛానెళ్లల్లో వచ్చిన కథనాలకు స్పందించిన బిఎస్‌ఇబి వెంటనే తన తప్పుల్ని సరిదిద్దుకునే క్రమంలో టాపర్స్‌కు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అక్కడ టాపర్స్ అజ్ఞానమేమిటో బహిర్గతమైంది. మూడు విభాగాల్లో టాపర్స్ అయిన రుబీరాయ్, సౌరబ్ శ్రేష్ఠ, రాహూల్ కుమార్ కనీసం రెండు మూడు ప్రశ్నలకు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో వారిని అనుత్తీర్ణత సాధించి నట్లు అధికారులు ప్రకటించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో టాపర్స్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు.

బీహార్ టాపర్లు ఒకే కళాశాలలో చదివి ఉండటం గమనార్హం. వైశాలి జిల్లా భగవాన్‌పూర్ తాలూకా పరిధిలోని కైరాత్‌పూర్ విషున్‌రాయ్ కళాశాలలో వీరి విద్యాభ్యాసం జరిగింది. ఇక్కడ 646 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్ష లకు హాజరయ్యారు. అందులో 534 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించగా, 96 మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన 14 మంది ఫెయిల్ అయ్యారు. నిజానికి ఇక్కడ ప్రామాణికమైన విద్యను బోధిస్తున్నట్లయితే అందరూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. అయితే బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణత సాధించ డంతో ఈ కళాశాల పస ఏమిటో అర్థమైపోయిం ది. అప్పుడే బిఎస్‌ఇబి బోర్డు రంగంలోకి దిగి ఉంటే సర్కారుకు కొద్ది పరువైనా దక్కి ఉండేది. బోర్డు నిర్లక్షం నితీష్ సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టింది.

ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తించాలి. టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మళ్ళి పరిక్షలు నిర్వహించగా ఆ పరీక్షకు రూబీ రాయ్‌ హాజరుకాలేదు. శనివారం ఆమెకు పరీక్ష కమిటీ నిర్వాహకులు తులసీదాస్‌ గురించి వ్యాసం రాయమంటే. ‘తులసీదాస్‌ జీ ప్రణామ్‌’ అని రాసి ఇక రాదని చెప్పిందంట. ఆమె సమాధానాన్ని చూసి అధికారులు ఆశ్చర్య పోయారు .“పరీక్షలో పాస్ చేయించమంటే స్టేట్ టాపర్ ని చేశాడు, మా నాన్న అతి తెలివి వల్ల నేను జైలు పాలు కావాల్సి వచ్చింది”. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 2016 సంవత్సరానికి బీహార్ ఇంటర్మీడియేట్ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన రూబీ రాయ్. దీన్ని బట్టి అక్కడి తల్లిదండ్రులు, విద్యార్థులు పరీక్షలను ఎలా తీసుకుంటారు అనేది అర్థమవుతుంది. విద్యావ్యవస్థలో మార్పుల కోసం పోరాడే వాళ్లు ఇలాంటి సీరియస్ అంశాలను ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇంత తతంగం నడుస్తున్నా కానీ నితీశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఇప్పుడుు వెలుగులోకి వచ్చింది కాబట్టి రూబీరాయ్ పేరు తెలుస్తోంది.. మరి బీహార్ లో ఎంత మంది రూబీరాయ్ లు ఉన్నారో..?!

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
తాగుబోతుల తెలంగాణ!
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అంత దైర్యం ఎక్కడిది..?
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
కాశ్మీర్ భారత్‌లో భాగమే
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
అమ్మను పంపించేశారా?

Comments

comments