సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?

BJP Leader SomuVeerraju Sailence for that

కావాల్సిన వాళ్లకు కంచాల్లో, కానివాళ్లకు అరటాకుల్లో అంటే మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే నారా చంద్రబాబు నాయుడు తమ వాళ్లను సంగతి పక్కన బెట్టి, తనకు పక్కలో బల్లెంలా తయారైన వారి గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ఇంతకీ ఈ మ్యాటర్ ఎవరికి సంబంధించినది అనుకుంటున్నారా..? ఏపి బిజెపి నాయకుడు సోము వీర్రాజు గురించి. ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ నేత‌లు కేంద్రంపై విరుచుకుప‌డుతున్నా కూడా వీర్రాజు అడ్రెస్ క‌నిపించ‌డం లేదు. వెర‌సి సోము వీర్రాజు సైలెంట్ అయిపోయార‌న్న వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. నిజ‌మే సోము వీర్రాజు సైలెంట్ అయిపోయారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపైనే కాదు… నేరుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టీడీపీ నేత‌లు ఏమన్నా వీర్రాజు స్పందించ‌డం లేదు.

బిజెపి మిత్రపక్షమైన టీడీపీ నేత‌లు ప్ర‌త్యేక హోదా, నిధుల విడుద‌ల‌లో జాప్యం త‌దిత‌రాల‌పై కేంద్రంపై పల్లెత్తు మాట అన్నా సోము వీర్రాజుకు మండిపోయేది. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు, సాక్షాత్తు సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపైనే ఆయ‌న ప‌లుమార్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌తో ఒకానొక సంద‌ర్భంలో బీజేపీతో టీడీపీ మైత్రికి ఫుల్ స్టాప్ ప‌డిపోయింద‌న్న భావ‌న కూడా వ్య‌క్త‌మైన ప‌రిస్థితి. ఆ త‌ర్వాత ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ సీటును టీడీపీ త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీకి ఇచ్చింది. ఈ సీటు ద్వారా సోము రాష్ట్రంలోని పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టారు. అయినా ఆయ‌న త‌న నోటికి ప‌ని చెప్ప‌డం మాత్రం ఆప‌లేదు. ఇదంతా మొన్న‌టిదాకా ఉన్న ప‌రిస్థితి.

ప్ర‌స్తుతం సోము వీర్రాజు అస‌లు  క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు త‌న‌ కేబినెట్ ను ఏర్పాటు చేసి దాదాపుగా రెండున్న‌రేళ్లు అవుతోంది. ఇప్ప‌టిదాకా విస్త‌ర‌ణ లేదు. పుర‌న్య‌వ‌స్థీక‌ర‌ణ అంత‌క‌న్నా లేదు. అయితే దీపావ‌ళికి ముందుగానో, ఆ త‌ర్వాతో కేబినెట్ విస్త‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి అన్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌తో పాటు ఆ పార్టీ మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన నేత‌లు త‌మ‌దైన రీతిలో య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇక కేబినెట్‌ను విస్త‌రిస్తే… త‌మ‌కు కేబినెట్ బెర్తును ఇవ్వాల‌ని బీజేపీ.. చంద్ర‌బాబును కోరింద‌ట‌. ఇందుకు చంద్ర‌బాబు కూడా స‌రేన‌న్నార‌ట‌. ఇక ఆ ప‌ద‌వి బీజేపీలోని ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న విష‌యానికి వ‌స్తే.. మొన్న‌టిదాకా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించి నిరాశకు గురైన సోము వీర్రాజుకే ఆ ప‌దవి ఖాయ‌మ‌ట‌. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద తెలుగుదేశం తమ్ముళ్లలో మాత్రం అసంతృప్తి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఉన్న తెలుగు తమ్ముళ్లకే దిక్కులేకుండా చేశారు.. ఇప్పుడు మాత్రం కమలనాధులకు కేబినెట్ లో బెర్త్ ఇస్తారా..? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..? చంద్రబాబు తలుకుంటే మినిస్ట్రీ పెద్ద విషయమా? మొత్తానికి సోము వీర్రాజు సైలెంట్ వెనక ఇంత కథ ఉంది అని మాత్రం చాలా మంది నమ్ముతున్న అంశం.

Related posts:
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments