టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్

BJP Playing Mind Game With TRS

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలను, నాయకులను తమ పార్టీలోకి చేర్చుకొని పార్టీ బలాన్ని మరింత పెంచుకుంది. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చతురత పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అప్రతిమతంగా నిలిపింది. కేసీఆర్ ముందు నుండి కూడా కొన్ని పార్టీలను తన మిత్రులుగా, మరికొన్ని పార్టీలను మాత్రం తన ప్రతిపక్ష పార్టీలుగా ఉంచుతున్నారు. కాగా నిజానికి ప్రతిపక్షంలో ఉండాల్సిన పార్టీ విచిత్రంగా రాజకీయం చేస్తోంది. అలా కేసీఆర్ తో విభేదించుకుండా సైలెంట్ మోడ్ లో ఉన్న పార్టీ ఏంటి అనుకుంటున్నారా..? బిజెపి.

నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బిజెపి పార్టీ అధికారాన్ని చేపట్టింది. మోదీ రాజకీయ చాణిక్య నీతి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా తెలంగాణలో బిజెపి నాయకుల నడవడిక, వారు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కేంద్రంలో తెలుగు రాష్ట్రాల తరఫున వెంకయ్య నాయుడు తర్వాత కీలకంగా ఉన్న బండారు దత్తాత్రేయ తెలంగాణలో ఎలా నడుచుకుంటున్నారు అనే దాన్ని బట్టి పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి దత్తాత్రేయ హాజరవుతుండటం చూస్తే టిఆర్ఎస్ తో బిజెపి ఎలాంటి సఖ్యత కోరుకుంటుందో తెలుస్తుంది.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు గొంతు చించుకుంటున్నా కానీ ఐదుగురు ఎమ్మెల్యేల బలం ఉన్న బిజెపి మాత్రం ఒక్కటంటే ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రభుత్వంలో లేని బిజెపి పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది అని అనేది తేలాలంటే.. ముందు కేసీఆర్, మోదీల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఏకైక రాజకీయ శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం వేరే ఏ పార్టీకి కూడా తెలంగాణలో అవకాశంలేకుండా పోయింది. మరి కేంద్రంలో ఉన్న బిజెపికి టిఆర్ఎస్ కాకుండా వేరే అవకాశం లేనేలేదు.

తెలంగాణలో బిజెపి సైలెంట్ గా ఉండటానికి టిఆర్ఎస్ బలమే కారణం. తెలంగాణలో టిఆర్ఎస్ కు 119 ఎమ్మెల్యేలు, 24 ఎంపీలు(రాజ్యసభ, లోక్ సభలో కలిపి) ఉన్నారు. భవిష్యత్తులో వచ్చే రాష్ట్రపతి ఎన్నికల టైంలో టిఆర్ఎస్ బలం లేకుండా బిజెపికి గడ్డుపరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టే ముందు నుండి కూడా టిఆర్ఎస్ తో కాస్త మిత్రపక్షంగానే ఉంది. కాగా బిజెపితో తాము జతకట్టేదిలేదని టిఆర్ఎస్ ముందే తేల్చేసింది. కానీ మోదీ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగంగా టిఆర్ఎస్ తో ఎలాంటి విభేదాలకు నాయకులు తావివ్వడం లేదని తెలుస్తోంది. ఎంతైనా మోదీ టాలెంటే టాలెంట్.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
జీఎస్టీ బిల్ కథ..
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
ఇక యుద్ధమే కానీ..
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
చెత్త టీంతో చంద్రబాబు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?

Comments

comments