సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?

BJP using Surgical strick for Political benefit

ఓ పక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో అధికార బిజెపి పార్టీ అసలే బలం లేని రాష్ట్రాల్లో ఎలా పట్టుసాధించాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడింది. చివరకు నరేంద్ర మోదీని హైలెట్ చేస్తూ.. వచ్చిన ఓ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. అయితే దీనిపై బిజెపి వర్గాల్లో నెలకొన్న భయాన్ని మోదీ ఎలా అధిగమించాలా.? అని తీవ్రంగా ఆలోచించి చివరకు రామబాణంలాంటి ఓ ఉపాయాన్ని కనుగొన్నారు. అదేమిటంటే.. ప్రస్తుతం బిజెపికి బాగా కలిసివస్తున్న సర్జికల్ స్ట్రైక్ ను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగి ఇప్పటికి రెండు వారాలుపైనే అఅయ్యింది. కానీ ఇంకా దానిపై చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి జరిగినప్పుడు అధికార భాజపాతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందుకు మోడీ ప్రభుత్వాన్ని, ఆర్మీని చాలా మెచ్చుకొన్నాయి. కానీ ఆ తరువాత అన్ని పార్టీలు వాటిని రాజకీయ కోణంలో నుంచి చూస్తూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి.

మోడీ ప్రభుత్వం మొదట్లో వాటి గురించి చాలా హుందాగా వ్యవహరించడంతో దేశప్రజలందరూ చాలా హర్షించారు. ప్రధాని నరేంద్ర మోడీకి బాసటగా నిలిచారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా మెల్లగా సర్జికల్ స్ట్రయిక్స్ పై రాజకీయాలు చేయడం మొదలుపెట్టడం ఎవరూ ఊహించలేని విషయమే. రానున్న ఎన్నికల కోసం బిజెపి ఓ రకంగా రక్షణమంత్రి మనోహర్ పారేకర్ తో చేయించిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని, అసహనాన్ని తెప్పించింది. సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ మొత్తం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్మీకి వెళుతుంది అన్న ప్రకటన రాజకీయంగా తీవ్ర సంచలనానికి కారణమైంది.

సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ క్లెయిం చేసుకొనేందుకు భాజపా నేతలు, మోడీ ప్రభుత్వంలో మంత్రులు ఎంతగా ప్రయత్నిస్తే దాని వలన వారికి అంతగా నష్టపోయే ప్రమాదం ఉంది. దాని క్రెడిట్ గురించి మాట్లాడితే దేశ ప్రజలకి స్వయంగా తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన పేరు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం, తన రాజకీయ లబ్ది కోసమే వాటి గురించి అతిగా ప్రచారం చేసుకొంటున్నారనేది వాస్తవమే. మొత్తానికి మనోహర్ పారికర్ నోటి నుండి ఇలాంటి ప్రకటన వస్తుంది అని ఎవరూ ఊహించనేలేదు. ముందు నుండి సర్జికల్ స్ట్రైక్ ను పొలిటికల్ గా వాడుకోవాలని అనుకున్న మోదీ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. మరి చూడాలి ఈ ఫలితాలు ఎన్నికల్లో ఎలా ప్రతిఫలిస్తాయో.

సర్జికల్ స్ట్రైక్ ను ఎన్నికల్లో వాడుకోవాలని ఎందుకు అనుకున్నారో తెలుగోడ విశ్లేషణ…
– మోదీకి, బిజెపికి ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి ఎలాంటి ఆయుధం లేదు. దాంతో దీన్ని వాడుకుంటోంది.
– బిజెపికి కలిసి వచ్చే కుల సమీకరణలు ఈ సారి పారడంలేదు. కుల సమీకరణల్లో బిజెపి మిగిలిన పార్టీలకంటే వెనకబడటంతో బిజెపి ఈ రకంగా అడుగులు వేస్తోంది అనుకోవచ్చు.
– ప్రతిసారి రాముడి పేరు చెప్పే బిజెపి ఈ సారి ఆ పేరును వాడుకునే పరిస్థితిలో లేదు. దాంతో సర్జికల్ స్ట్రైక్ ఇప్పటికిప్పుడు తమ చేతిలో ఉన్న ఆయుధంగా బిజెపి భావిస్తోంది.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ఉక్కిరిబిక్కిరి
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
బాబు Khan
పట్టిసీమ వరమా..? వృధానా..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
మెరుపు దాడి... నిజమా-కాదా?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
రాహుల్ పై కరుణ ఆగ్రహం
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments