బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే

black money in Bathroom wall

మోదీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఒక్కో అద్భుతం వెలుగులోకి వస్తోంది. మొన్నటి దాకా మోదీ దెబ్బతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని విన్నా. కానీ నల్లకుబేరులు మోదీ దెబ్బకు ఎలా విలవిలలాడుతున్నారో మాత్రం చాలా వరకు తెలియదు. అయితే తాజాగా ఐటీ అధికారులు చేస్తున్న దాడులు అలాంటి నల్లకుబేరులు నల్లధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక చేస్తున్న అద్భుతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ బడా బాబు బాగోతం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జేమ్స్ బాండ్ సినిమా గుర్తుకు వస్తుంది.

నెలరోజులైనా కొత్త నోట్లు సామాన్యుడికి అందక అవస్థలు పడుతుంటే ఉన్నోడు మాత్రం కట్టలు కట్టలు దాచిపెడుతున్నాడు. ఎక్కడ చూసిన కొత్తనోట్లు వందలకు వందల కోట్ల కొత్త నోట్లు బయటపడుతున్నాయి. ఇదిలా ఉండగా బెంగళూరులోని ఒక హవాలా వ్యాపారి ఇంటి పైన దాడులు చేసిన ఐ.టి కి దిమ్మ తిరిగి పోయింది. విషయం ఏంటంటే అతను దాచిపెట్టిన విధానం చూసిన ఐ.టి అధికారులు ఆశ్చర్య పోయారు. బాత్ రూమ్ లో టైల్స్ గోడ, గోడలు అన్ని మూసే ఉన్నాయి. అయిన అధికారులకు ఎక్కడో అనుమానం వచ్చింది. మొత్తం పరిశీలించారు. చివరకు అది గోడ కాదు డబ్బు మూటలున్న గది. ఆ గదికి తలుపులు అడ్డంగా పెట్టిన టైల్స్… కానీ అవి ఓపెన్ అవ్వాలంటే, ఎక్కడో ఇంటి కిటికీ కి ఉన్న తలుపు ఓపెన్ ఆ గోడ ఓపెన్ అవుతుంది. ఇదీ అతను డబ్బు దాచిపెట్టిన విధానం.

నల్లధనంపై సమాచారం అందుకున్న ఐటీ అధికారులు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హవాలా డీలర్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడింది. డీలర్ ఇంట్లో సీక్రెట్‌గా నిర్మించిన బాత్రూమ్‌లో  5.07 కోట్ల కొత్త నోట్లను, 90 లక్షల పాత నోట్లు, 32 కేజీల బంగారం బయటపడింది. దీంతో అధికారులు నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని, డీలర్‌ను అరెస్ట్ చేశారు. ఈ డీలర్ కర్ణాటక సీనియర్ నటుడు దొడ్డన్న కు బంధువు అన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

Related posts:
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
మోదీ ప్రాణానికి ముప్పు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
జయ మరణం ముందే తెలుసా?
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
డబ్బు మొత్తం నల్లధనం కాదు
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments