10 వేలకోట్ల రచ్చ – తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన

cbn-black-money

నరేంద్ర మోడి నేతృత్వములో అత్యంత భారీ మెజారిటితో 2014లో అధికారంలోకి వచ్చిన బి.జే.పి తమ మేనిఫెస్టోలోని వాగ్దానాలను నిలబెట్టుకోవడం వారి బాధ్యత. అటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలికితీత ప్రధానమైనది. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని ఎట్టి పరిస్తితులలోనైనా సరే తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత విఫలమైన సంఘటన అందరికీ తెలిసిందే. కాగా ప్రతి పక్షాలనుండి.. ఇంకా యావత్ భారత దేశం నుండి కూడ ఈ ఒత్తిడి బి.జే.పికి ఎక్కువైంది.

దీనికి ప్రత్యామ్నాయంగా పన్ను ఎగ్గొట్టి నల్లధనం పోగేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కూడ గట్టిన నల్లధనంలో 40% ప్రభుత్వానికి ఇచ్చినట్లైతే వారి పేర్లను గోప్యంగా ఉంచటమే కాకుండ వారిని ఎటువంటి ప్రశ్నలను అడగబోమని దానికి ఆఖరు తేదీని ప్రకటించింది. ఆఖరు తేది దాటిన తరువాత మాత్రం కొరడా తప్పదు అని ప్రభుతము ఖచ్చితముగ చెప్పిన నేపద్యములో.. ఇదే మంచి అవకాశంగా భావించిన పలువురు.. ప్రభుత్వానికి సహకరించి దాదపుగా 65,000 కోట్ల రూపాయల నల్లధనమును తెల్లగా మార్చుకోవడం జరిగింది.

ఇక్కడ వరకు అంతా బాగానే వుంది. అసలు చిచ్చు ఇప్పుడే మొదలైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యు ఇస్తూ గోప్యంగా ఉంచవలసిన నల్లధనంపై ఒక లీకు ఇవ్వడము జరిగింది. అది ఎమిటంటే ఏవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని 10 వేల కోట్ల రుపాయల నల్లధనాన్ని చూపించారని తెలిపారు. అంతే కాకుండా ఒకే వ్యక్తి దగ్గర అంత డబ్బు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు అన్నారు. అంతే.. ఇదే చంద్రబాబు పెట్టిన పెద్ద చిచ్చు అని చెప్పాలి.

ఇంకేముంది.. పచ్చ మీడియా పండగ చేసుకున్నాయి. పచ్చ పత్రికలు వారి సొంత విశ్లేషణలతో ఆధరాలు లేని రాతలు రాసి లోటస్ పాండు వైపుకు వేళ్ళు చూపించాయి. ఇవి చదవగానే తెలుగు తమ్ముళ్ళు ఆ వ్యక్తి జగనేనని, అది అంతా అవినీతి సంపాదనని దుయ్యబట్టారు. ఇది చాలదు అన్నట్లు సొషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.

అంతే.. ఎల్లో ఆర్మికు జగన్ డిజిటల్ సేనాకు మద్య యుద్ధం మొదలైంది. మొత్తం ఎపిసొడ్ ను తిప్పి కొట్టడం మొదలు పెట్టారు జగన్ అభిమానులు, వై.కా.పా కార్యకర్తలు. టిడిపి వాళ్ళకి పిచ్చెక్కిందని, చంద్రబాబు పెద్ద డైవర్షన్ మాస్టర్ అని, తన ఓటుకు నోటు కేసు నుండి డైవర్ట్ చేయడానికే ఈ పది వేల కొట్ల విషయం చెప్పాడని, దానికి మీడియా రాసే కల్పిత రాతలను చదివి గొర్రెల్లాగా జగన్ పేరుతో అరుస్తున్నాయని.. దొంగా దొంగా అని పది సార్లు అంటె దొంగైపొతాడ దొరా! అని జగన్ డిజిటల్ సేన తెలుగుదేశం వారి అభాండాలను, వాదనలను తిప్పికొట్టడం జరిగింది.

ఏది ఏమైనా.. ప్రశాంతంగా దసరా పండుగ చేసుకోకుండా ఈ రచ్చ ఏమిటని.. ఈ రాజకీయ నాయకులు ఇంతేనని ప్రజలు విస్తుపోతున్నారు.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
అన్నదమ్ముల సవాల్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
తొక్కితే తాటతీస్తారు
చెత్త టీంతో చంద్రబాబు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments