పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి

Bomb Attack in a Marriage at Turkey

అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా సాగుతున్న పెళ్లిలో చావు కళ కనిపించింది. హుషారుగా సాగిల్సిన పెళ్లి వేడుక ఏడుపులతో సాగింది. పెళ్లి వేదిక చుట్టూ రక్తపుటేరులు పారాయి. పెళ్లిలో జరిగిన మానవ బాంబ్ దాడిలో ఏకంగా 51 మంది మృతి చెందారు. సిరియాకు దగ్గరలో ఉండే టర్కీలోని గజియన్‌టెప్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు దాదాపుగా 300 మందిదాకా హాజరుకాగా అందులో 51 మంది మృత్యువాత పడ్డారు. కాగా వధూవరులు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఆత్మాహుతి దాడిని ఖండించారు. ఇది ఐఎస్‌ పనేనని ప్రకటించారు. అమెరికాలో ఉంటూ టర్కీలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్న మతబోధకుడు ఫతుల్లా గులెన్‌కి.. ఐఎస్‌ ఉగ్రవాదులకు తేడాలేదని విమర్శించారు. గజియన్‌టెప్‌ నగరం సిరియాకు సమీపంలో ఉంటుంది. ఈ దాడికి పాల్పడింది ఓ 12 ఏళ్ల కుర్రాడు అని టర్కీ అధ్యక్షుడు వెల్లడించారు. అయితే ఆ కుర్రాడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని.. కానీ దాడి తర్వాత వాళ్లు కనిపించలేదని సమాచారం. సిరియా నుండి టర్కీకి శరణార్థులతోపాటు పలువురు ఐఎస్‌ ఉగ్రవాదులు సైతం నగరంలో ఆశ్రయం పొందుతున్నారని టర్కీ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆరిపోయే దీపంలా టిడిపి?
బాబోయ్ బాబు వదల్లేదట
గుజరాత్ సిఎం రాజీనామా
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
కాశ్మీర్ భారత్‌లో భాగమే
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
చంద్రబాబు చిన్న చూపు
మావో నాయకుడు ఆర్కే క్షేమం
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
బెంగళూరుకు భంగపాటే
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
దివీస్ పై జగన్ కన్నెర్ర
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
చెబితే 50.. దొరికితే 90
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..

Comments

comments