జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు

BSNL announce offer in the competetion with Jio

తాటిని తన్నే వాడుంటే దాని తలతన్నే వాడుంటాడు అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇప్పుడు టెలికాం రంగంలో సంచలనానికి తెర తీసిన జియోకు పోటీగా బిఎస్ఎన్ఎల్ కూడా సై అంటోంది. ఉచిత వాయిస్ కాల్స్ , తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్యాకేజ్ లు అంటూ మొబైల్ రంగంలోకి దూసుకొచ్చి ఇతర టెలికం సంస్థలకు అనూహ్యంగా షాకిచ్చిన జియో…. ఈ మేరకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ ముందుకొస్తోంది.

జియో కేవలం 4జీ ఫోన్లకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 2జీ, 3 జీ ఫోన్లకు ఈ సౌకర్యం అందించనుందట. కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు కొత్త కొత్త ఆఫర్లతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తాం’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. ‘జియోకంటే తక్కువ రేట్ కే ఈ ప్లాన్ అందించనున్నాం. ఇది కేవలం రూ.2 నుంచి రూ.4 ఉండొచ్చు’ అని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో ఇతర టెలీకాం కంపెనీలపై ఈ ప్రభావం స్పష్టంగా పడనుంది. వారు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే జియో దెబ్బతో మార్కెట్ మొత్తం గందరగోళంగా మారిన పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయం కస్టమర్లకు మాత్రం మంచి అవకాశాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే జియో తన కస్టమర్ల కోసం భారీ ఆఫర్లు అందిస్తుంటే తాజాగా ఎయిర్ టెల్, ఐడియాలు కూడా అందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా బిఎస్ఎన్ఎల్ కూడా రంగంలోకి దిగితే మాత్రం టెలికాం రంగంలో మరింత మార్పులు వస్తాయి అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ అపరిమిత వాయిస్ కాల్స్ ముందుగా కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్ లో వర్తిస్తాయని తర్వాత అన్ని రాష్ట్రాలకు వర్తించనున్నాయి.  బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచేలా, రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా ఓ సరికొత్త ప్లాన్‌కు రూపకల్పన చేస్తోందని టెలికామ్ రంగంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. రిలయన్స్ జియో ఏ వ్యూహంతో అయితే కస్టమర్లను తన వైపుకు తిప్పుకుందో… అదే వ్యూహంతో బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకొట్టాలని చూస్తోంది. మరి చూడాలి బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
తెలంగాణకు ప్రత్యేక అండ
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
అకౌంట్లో పదివేలు వస్తాయా?
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు

Comments

comments