హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్

Buidling collapse in Hyderabad

హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. గతంలో హైదరాబాద్ నగరంలో వచ్చిన వరద తర్వాత ప్రభుత్వం చర్యలకు దిగినట్లే తాజా విషాదం తర్వాత అలాంటి చర్యలకు దిగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. నగరంలోని నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిపోయింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో దాదాపుగా 20 మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ప్రస్తుతానికి ఇద్దరిని కాపాడినట్లు తెలిసింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో బిల్డింగ్ ల మీద బిల్డింగులు అడ్డగోలుగా నిర్మిస్తున్నారు. అలాంటి నిర్మాణాల్లో చాలా వాటికి అసలు అనుమతులు కూడా ఉండవు. అధికార యంత్రాంగం నిద్రమత్తు వల్ల కలిగిన ప్రమాదాల్లో నానక్‌రామ్‌గూడలోని  భవనం కూలిపోవడం కూడా ఒకటి. కూలిన భవనం చాలా తక్కువ స్పేస్ లో ఏడు అంతస్తులు కడుతుండటం, దానికితోడు భవన నిర్మాణం వెనకాలు మరో భవన నిర్మాణం కోసం గుంతలు తీసేందుకు బాంబులు పెట్టి పేల్చడం, ఆపై  సెల్లార్ల కోసం లోతుగా తవ్వడంతో ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

కాగా భవన నిర్మాణంలో విజయనగరం, ఛత్తీస్ ఘడ్ వాసులు పాల్గొనే వారని, వారే శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా దీనిపై సమాచారం అందుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ రావు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఇక కూలిపోయిన భవనంకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని తెలుస్తోంది. మరి కేసీఆర్ సర్కార్ ఈ ఘటన తర్వాతైనా ఇలాంటి వాటిపై కాస్త నజర్ వేస్తే మంచిది అని సలహా.

Related posts:
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఏపీ బంద్.. హోదా కోసం
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
బాబు గారి అతి తెలివి
మంత్రుల ఫోన్లు బంద్
బతుకు బస్టాండ్ అంటే ఇదే
చంద్రబాబు చిన్న చూపు
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
ఆయన మాట్లాడితే భూకంపం
ఒక్క రూపాయికే చీర
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments