టాయిలెట్ కట్టు… రజినీని పట్టు

Build a Toilet and Get Rajinikanths kabali Tickets

ఇదేంటి కొత్త రకం గేమ్ షో అనుకుంటున్నారా.? లేదు లేదు ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఏంటి ప్రభుత్వం కూడా ఇలాంటి పేర్లతో పథకాలను ప్రవేశపెడుతుందా అని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా ఆ పేరు అని కాకుండా అలాంటి కాన్సెప్ట్ తోనే తాజాగా పాండిచ్చేరిలో ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం పూనుకుంది. మామూలుగా అయితే ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి ప్రయత్నాల్లో బాగంగా రజినీకాంత్ ను వాడుకొని… ప్రజల ఆరోగ్యాలను కాపాడే ప్రయత్నం చేస్తోంది.

అసలు మ్యాటర్ ఏంటంటే.. పాండిచ్చేరిలోని సెల్లిపేట్ అనే పంచాయితీలో టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టాయిలెట్లు నిర్మించుకున్న వారికి రజినీకాంత్ సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించింది. రజినీకాంత్ సినిమా అందునా.. విపరీతమైన క్రేజ్ ఉన్న కబాలీ సినిమా టికెట్లు కావడంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. పాండిచ్చేరి కలెక్టర్ స్టార్ట్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.

సెల్లిపేట్ లో 772 ఇళ్లు ఉండగా అందులో 447 ఇళ్లకు టాయిలెట్ ఫెసిలిటి లేదు. గ్రామంలో 58 శాతం ప్రజలు బహిరంగంగా మలవిసర్జనకు వెళుతున్నారు. దాంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే గ్రామంలో టాయిలెట్ల నిర్మాణానికి తగిన అవగాహన కల్పించాలని సంకల్పించింది. చివరకు రజినీకాంత్ కబాలీ ఐడియా తట్టింది. దాన్ని వెంటనే ప్రకటించేసింది. తాజాగా పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన కిరణ్ బేడి ఈ కొత్త కాన్సెప్ట్ పై ట్వీట్ చెయ్యడంతొ అందరి దృష్టి దీనిపై పడింది. ఎంతైనా కబాలీ క్రేజ్ అలాంటిది. మొత్తానికి కబాలీ సినిమా టికెట్లు కూడా జనాలకు మంచి చెయ్యడానికి పనికి వస్తుండటం విశేషం.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
ఆరిపోయే దీపంలా టిడిపి?
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
జగన్ సభలో బాబు సినిమా
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
బినామీలు భయపడే మోదీ ప్లాన్
మోదీ ఒక్కడే తెలివైనోడా?

Comments

comments