బుల్లెట్ బాబా…అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు

Bullet baba in Rajasthan

ఫలానా ప్రదేశంలో ఫలానా దేవుడు లేదా దేవత ఒకప్పుడు తిరిగార;నో, కాలుమోపారనో లేదంటే అక్కడ వారి విగ్రహాలు వెలిశా;నో భక్తులు ఆయా దేవుళ్లు, దేవతల పేరిట గుళ్లు కట్టించడం సాధార;ణంగా జరిగే విషయమే. అయితే తాజాగా రాజస్థాన్ లోని ఆ ప్రాంతంలో మాత్రం ఏకంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ నే దైవంగా వెలసిందని భావిస్తూ అక్కడి ప్రజలు కొలుస్తున్నారు. ఆ బుల్లెట్ బైక్ కు నిత్యం పూజలు, అభిషేకాలు చేయడం, హారతులు పట్టడం, గాజులు, దుస్తులు వంటివి సమర్పించి కోర్కెలు తీర్చమని వేడుకోవడం’ ఇప్పుడక్కడ జరుగుతున్న తంతు. ఈ క్రమంలో ఆ బైక్ను ద;ర్శించుకునేందుకు చాలా మంది భక్తులు రోజూ అక్కడికి చేరుకుంటున్నారు కూడా.

రాజస్థాన్లోని జోధ్పూర్లో 1991లో ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బన్నా అనే ఓ యువ లీడర్ ఉండేవాడు. అతనికి రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సిసి బైక్ ఉండేది. అయితే ఒకరోజు బన్నా అనుకోకుండా ఓ చౌరస్తాలోని చెట్టుకు తన బైక్ తో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆ బైక్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానీ ఎవరూ తీసుకు రాకుండానే ఆ బైక్ యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి దానంతట అదే రాత్రి పూట వచ్చిందట. మరుసటి రోజు పోలీసులు ఆ బైక్ ను చైన్ లతో కట్టి తీసుకెళ్లారు. అయినా బైక్ మళ్లీ అలాగే వచ్చిందట. దీంతో పోలీసులు దాన్ని అలాగే వదిలేశారు. అయితే అప్పటి స్థానికులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. తమ లీడర్ బన్నా దురదృష్టవశాత్తూ చనిపోవడంతో బైక్ రూపంలో మళ్లీ తన వద్దకు వచ్చాడని స్థానికులు భావించి ఆ బైక్ ను యాక్సిడెంట్ అయిన చెట్టు వద్దే ఉంచి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. దీంతో ఆ బైక్ ఉన్న ప్రదేశం కాస్తా బుల్లెట్ బాబా పుణ్య;క్షేత్రంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ బైక్ కు రోజూ పూజలు చేయడం కోసం ఓ అర్చకున్ని కూడా నియమించారు. ఎంతైనా ఇండియా కదా ఏదైనా సాధ్యమే.

Related posts:
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
ఏపీకి ఆ అర్హత లేదా?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
జయ మరణం ముందే తెలుసా?
ట్రంప్ సంచలన నిర్ణయం
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments