ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్

Ramdass

Call for General body meeting Watch man ramdass. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

తెలుగు రాష్ట్రాల్లో వెటకారం, పంతం, చివరకు రాజకీయం ఎవరికి బాగా తెలుసు అంటే ఖచ్చితంగా సీమాంధ్రులకే అని సమాధానం వస్తుంది. గోదావరి , కృష్ణా జిల్లా వాసులకు వ్యవసాయం ఎంత తెలుసో.. వెటకారం అంతకన్నా కాస్త ఎక్కువే తెలుసు. రాజకీయాలు అంటే ముందు నుండి కూడా ఏపి కేంద్రంగా ఉంది. అక్కడ జరిగే రాజకీయాలు దిల్లీలో కూడా జరగవు అని ముందు నుండి ఓ టాక్ ఉంది. అయితే తాజాగా విజయవాడకు చెందిన వాచ్ మెన్ రాందాస్ కథ తెలిస్తే మాత్రం.. ఏపిలో రాజకీయాలు ఈ రేంజ్ లో ఉంటాయా..? అని ఆశ్చర్యపోకతప్పదు. వాచ్ మెన్ రాందాస్ గురించి తెలుసుకున్నాక.. ఇంకోసారి ఆంధ్రావాళ్లతో రాజకీయం గురించి మాట్లాడే సాహసం చెయ్యరు.

విజయవాడలోని ఓ అపార్ట్ మెంట్ కు రాందాస్ అనే ఓ వ్యక్తి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. తన భార్యతో పాటు ఉంటున్న రాందాస్ కు కాస్త చదువు కూడా అబ్బింది. ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తారు. ఇక రాందాస్ భార్య అపార్ట్ మెంట్ లోని ప్లాట్లలో పని మనిషిగా పని చేస్తోంది. కాగా వాచ్ మెన్ రాందాస్ పై కొన్నాళ్లుగా ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. తాగి వస్తున్నాడని.. అపార్ట్ మెంట్ లో ఎవరికి మర్యాద కూడా ఇవ్వడం లేదని తేలింది. దాంతో అతడిని తీసివెయ్యడానికి అక్కడ వాళ్లు రెడీ అయ్యారు.

కాగా విషయం తెలుసుకున్న రాందాస్.. వెంటనే తన భార్యతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. అపార్ట్ మెంట్ లో ఎవరికి.. ఎవరితో అస్సలు పడదో తెలుసుకున్నారు. ఎవరెవరు మాట్లాడితే అందరూ సైలెంట్ గా అవుతారో వాళ్ల ఇళ్లలో రాందాస్ భార్య బాగా పనిచేసేది… వారికి విపరీతమైన గౌరవం ఇవ్వడం చేసేది. దాంతో ఆమెకు వాళ్లంతా సపోర్ట్ గా నిలిచారు. చాలా మంది మహిళలు ఆమె కుటుంబాన్ని అపార్ట్ మెంట్ నుండి పంపించడానికి వీలులేదని వాదించారు. ఇది చిలికి చిలికి అపార్ట్ మెంట్ లోని వాళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.

రాందాస్ కుటుంబాన్ని అపార్ట్ మెంట్ నుండి పంపించాలని ఓ వర్గం.. పంపించకూడదు అని ఓ వర్గం వాదనలకు దిగాయి. అపార్ట్ మెంట్ లో అందరూ ఉద్యోగుల కుటుంబాలు, రిటైడ్ ఉద్యోగులు ఫ్యామిలీలు ఉంటున్నాయి. ఓ వాచ్ మెన్ కుటుంబం కోసం వాళ్లు రెండు వర్గాలుగా చీలిపోవడం పెద్ద సెన్సేషన్ గా మారింది. దాంతో రాందాస్ ను తీసివెయ్యాలి అన్న వర్గం వెంటనే అతన్ని తీసివేస్తున్నట్లు అతడికి చెప్పింది. దానికి అతడు చెప్పిన సమాధానం విని అందరూ షాక్ తిన్నారు.

కాల్ ది జనరల్ బాడీ మీటింగ్ (Call for general body meeting) అనడంతో అందరూ ఖంగుతిన్నారు. అయినా ఓ వాచ్ మెన్ ను తీసివెయ్యాలి అంటే అపార్ట్ మెంట్ జనరల్ బాడీ మీటింగ్ జరగాలా..? ఏపిలో ఏ రేంజ్ లో పాలిటిక్స్ జరుగుతాయి అన్న దానికి విజయవాడకు చెందిన వాచ్ మెన్ రాందాస్ ఘటన ఓ ఉదాహరణ. నరనరాలన రాజకీయాలను చేసే ఆంధ్రుల గురించి ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో కథలున్నాయి. ఇంతకీ రాందాస్ ను అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ఉద్యోగం నుండి తీసివేశారా..? లేదా అనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్ లో తెలియజేస్తాం.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
పవన్ మాస్టర్ స్కెచ్
ఆ అరుపులేంటి..?
మూడింటికి తేడా ఏంటి..?
వెనకడుగు
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
మోదీ భజన అందుకేనా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments