కోలుకోలేని పరిస్థితి వస్తోందట

Candrababu Naidu fears about TDP

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడే కళ్లకు కనబడుతున్నట్లుంది. అందుకే కింది క్యాడర్ ను హెచ్చరిస్తున్నారు. అలర్ట్ గా ఉండాలి లేకుంటే మీతో పాటు నేను కూడా మునిగిపోతాను అంటూ హెచ్చరికలు జారీ  చేస్తున్నారు. అస‌లే పార్టీ ప‌రిస్థితి బాగోలేని స‌మ‌యంలో కొంద‌రి తీరుతో కోలుకోలేని ప‌రిస్థితి వ‌చ్చేస్తోంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న పార్టీ నేత‌ల ముందు తీవ్ర ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. ముఖ్యంగా ఇసుక వ్య‌వ‌హారాల్లో ఇప్ప‌టికీ ప‌లువురు నేత‌లు త‌ల‌మున‌క‌లై ఉన్నార‌ని వాపోయారు. వారి వ‌ల్ల పార్టీకి అప్ర‌తిష్ట‌త వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో మంత్రుల‌ది, ఎమ్మెల్యేల‌దే బాధ్య‌త అని సీఎం హెచ్చ‌రించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆయా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. అదే స‌మ‌యంలో తొల‌గించిన ఓట్లు చేర్చ‌డం కోసం ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హిస్తామ‌న్నారు. న‌వంబ‌ర్ 1 నుంచి జ‌న‌చైత‌న్య యాత్ర‌లు అంద‌రూ బాధ్య‌త వ‌హించాల‌న్నారు, సీల్డ్ క‌వ‌ర్ల‌లో ఇచ్చిన నివేదిక‌ల్లో చేసిన కొంద‌రు మంత్రులు స్వీక‌రించ‌డం లేద‌ని సీఎం పేర్కొన‌డం విశేషం.

నియోజ‌క‌వ‌ర్గాల‌లో పార్టీకి భారంగా మారుతున్న ఎమ్మెల్యేల‌ను స‌హించేది లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఉండ‌దు జాగ్ర‌త్త అంటూ ఆయ‌న హెచ్చ‌రించ‌డం విశేషం. మొత్తంగా టీడీపీ ప‌రిస్థితి బాగోలేద‌ని సీఎం చేసిన వ్యాఖ్య‌లు పెద్ద‌స్థాయిలో చ‌ర్చనీయాంశ‌మ‌వుతున్నాయి. రేష‌న్ కార్డుల జారీ, పెన్ష‌న్ల పెంపుదల వంటి అంశాల‌పై మంత్రులు అచ్చెన్నాయుడు స‌హా ప‌లువురు చేసిన ప్ర‌తిపాద‌న‌ల ప‌ట్ల సీఎం సూటిగా స్పందించ‌లేద‌ని స‌మాచారం. పార్టీ జిల్లా అధ్య‌క్షులు, మంత్రులు, ఇత‌ర కీల‌క నేత‌లు పాల్గొన్న స‌మావేశంలో ఆయ‌న ప్ర‌స్తావించిన విష‌యాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
ఆయనకు వంద మంది భార్యలు
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గుజరాత్ సిఎం రాజీనామా
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
ముద్రగడ సవాల్
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
బిచ్చగాళ్లు కావలెను
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
తెలంగాణ 3300 కోట్లు పాయె
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!

Comments

comments