కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Captain Dhoni announced his retirement to captancy

కెప్టెన్ కూల్ గా,ఇండియన్ క్రికెట్ లో లెజెండ్ గా మారిన మహేంద్రసింగ్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనం రేపింది. వన్డే,టీ20 ఫార్మేట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని బీసిసిఐకి సమాచారమిచ్చాడు. దీంతో ధోనీ స్థానంలో కోహ్లీ పగ్గాలు అందుకోవడం లాంఛనమే. భారత క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఇకపై ఆటగాడిగా మాత్రమే చూడబోతున్నాం. ఇంగ్లాండ్‌తో మరో 10 రోజుల్లో వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో ధోనీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నిజానికి 2014 చివర్లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుంచీ వన్డేల్లో అతను ఎంతకాలం కొనసాగుతాడనే దానిపైనే ఎక్కువ  చర్చ జరిగింది. ధోనీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్‌కోహ్లీ జట్టును విజయాల బాటలో నడిపించడంతో పరిమిత ఓవర్ల ఫార్మేట్‌లోనూ అతనికే బాధ్యతలు అప్పగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే కోహ్లీకి పూర్తిస్థాయి సారథ్యం ఇచ్చేందుకు ఇంకా సమయముందన్న వారూ లేకపోలేదు. ఇదిలా ఉంటే గత ఏడాది కాలంగా ధోనీ ఫామ్ పేలవంగానే ఉంది. 2015 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కే పరిమితమైన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావించినా… ధోనీ మాత్రం వచ్చే వరల్డ్‌కప్ కూడా ఆడతానంటూ వ్యాఖ్యానించాడు.

అయితే ఏడాది కాలంగా ఇండియాలో జట్టును విజయాల బాటలో నడిపించిన ధోనీ విదేశాల్లో మాత్రం వైఫల్యాల బాటలోనే ఉన్నాడు. ఇది కూడా అతని తాజా నిర్ణయంపై ప్రభావం చూపిందని చెప్పొచ్చు. 2004లో వన్డే కెరీర్ ఆరంభించిన మహేంద్రుడు తక్కువ కాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. 2007 వరల్డ్‌కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ నుంచి వన్డే జట్టు పగ్గాలు అందుకున్న ధోనీ భారత క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ధోనీ ఇప్పటి వరకూ 199 వన్డేల్లో సారథ్యం వహించగా.. 110 మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. అలాగే 72 టీ ట్వంటీల్లో 41 విజయాలను అందించాడు. 2007లో టీ ట్వంటీ ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను అందించిన ధోనీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా అన్ని ఐసిసి ట్రోఫీలు అందుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. గత ఏడాది చివర్లో న్యూజిలాండ్‌పై 3-2తో వన్డే సిరీస్ విజయం సారథిగా ధోనీ కెరీర్‌లో చివరిది. ధోనీ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచినా… సరైన సమయంలోనే ప్రకటించాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. కొత్త కెప్టెన్‌ను బీసిసిఐ అధికారికంగా ప్రకటించకున్నా.. టెస్ట్ ఫార్మేట్‌లో జట్టును సమర్థంగా లీడ్ చేస్తోన్న కోహ్లీనే ధోనీ వారసుడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
సిరీస్ టీమిండియా సొంతం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments