క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Cashless India will be a dream

దేశంలో డీమానిటైజేషన్ కొత్త చర్చకు తెర తీసింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం డీమానిటైజేషన్. అప్పటి దాకా చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నగదు కొరతతో బాధలు మొదలయ్యేసరికి అందరూ క్యాష్ లెస్ వైపుకు అడుగులు వెయ్యాలి అంటూ మోదీ హితవు పలికారు. దాంతో దేశంలో క్యాష్ లెస్ విప్లవం రాబోతోంది అని అందరూ సంబరపడ్డారు. కానీ మోదీ ఆశించిన ఆ క్యాష్ లెస్ కు ఆయనే తూట్లు పొడుచుకున్నారు. అవును.. మోదీ చేస్తున్న తప్పే క్యాష్ లెస్ కాన్సెప్ట్ నుండి ప్రజలను దూరం చేస్తోంది. అసలు మోదీ చేస్తున్న తప్పేంది? క్యాష్ లెస్ ఇండియా ఎందుకు కల? అనే ప్రశ్నలకు ఈ ఆర్టికల్ లో సమాధానాలు దొరుకుతాయి.

మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో నోట్ల కొరత ఏర్పడింది. దేశంలో చాలా వరకు పెద్దనోట్లే చలామణిలో ఉన్నాయి. దేశంలోని కరెన్సీలో 85శాతం పెద్ద నోట్లే ఉండటం వల్ల అందరికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే డీమానిటైజేషన్ తర్వాత క్యాష్ లెస్ దిశగా అందరూ అడుగులు వెయ్యాలని అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మోదీ ప్రకటించారు. ఈ మేరకు డిజిటల్ పేమెంట్స్ కు కొన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్యాష్ లెస్ సర్వీసులకు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. అయితే మోదీ మాత్రం ఓ తప్పుచేసి ఇప్పుడు క్యాష్ లెస్ కావాలి అంటే అది దేశానికి విఘాతమే కలుగుతోంది.

దేశంలో డీమానిటైజేషన్ తర్వాత కరెన్సీ దొరకడం తగ్గింది. దేశంలో ప్రజల వద్ద ఉన్న దాదాపుగా 11లక్షల కోట్ల పైచిలుకు డబ్బులు బ్యాంకుల్లో జమా అయ్యాయి. అయితే మోదీ సర్కార్ ఆ డబ్బులను నెమ్మదిగా విడుదల చేస్తూ.. అంతలో అందరికి క్యాష్ లెస్ సర్వీసుల గురించి అవగాహన కల్పించాల్సింది. కానీ అలా చెయ్యలేదు. వాస్తవానికి ఏం జరిగింది అంటే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత అందరూ డిజిటల్ పేమెంట్స్ వైపుకు వెళ్లారు. కానీ అది కేవలం కొద్ది రోజులు మాత్రమే. తర్వాత అందరికి తిరిగి నగదు లభిస్తుండటంతో క్యాష్ లెస్ పేమెంట్లకు దూరమవుతున్నారు.

మెట్రో నగరాల్లో, టైర్ 1, టైర్ 2 నగరాల్లో మాత్రం క్యాష్ లెస్ వైపు అడుగులు వేస్తున్నా అది మోదీ అనుకున్న స్థాయి కాదు. ముందుగా కరెన్సీ వాడకాన్ని తగ్గించి ఆన్ లైన్ పేమెంట్ల వైపుకు మళ్లేలా చెయ్యాల్సింది. కానీ అలా చెయ్యలేదు సరికదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుంది అని ఏకంగా నగదును జీతం కింద ఇచ్చారు. దీంతో తిరిగి నగదు సరఫరా పెరిగింది. నగదు సరఫరా పెరిగితే డిజిటల్ పేమెంట్స్ వైపుకు ఎవరూ వెళ్లరు. అలాంటప్పుడు క్యాష్ లెస్ అనేది సాధ్యం కాదు.

మోదీ ప్రభుత్వం డీమానిటైజేషన్ నిర్ణయం తప్పా? కరెక్టా? అనేది ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం కాదు కానీ క్యాష్ లెస్ ఇండియాకు మాత్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా అన్ని రకాల ప్రభుత్వ లావాదేవీలను ఆన్ లైన్ ద్వారా చెయ్యడం చెయ్యాలి. అలా చేస్తే ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి పనికి క్యాష్ లెస్ సర్వీస్ అవసరం అవుతుంది కాబట్టి జనాలు మెల్లిగా అలవాటుపడతారు. ఇక బ్యాంకుల్లోకి వచ్చిన నగదును నేరుగా చేతికి అందించకుండా డిజిటల్ పేమెంట్స్ చెయ్యాలని, క్యాష్ లెస్ సర్వీసులకు అలవాటు కావాలని జనాలను మోటివేట్ చెయ్యాలి. అలా చెయ్యనంత కాలం మోదీ తలుచుకున్న క్యాష్ లెస్ ఇండియా ఓ కలే.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
ఆ అద్భుతానికి పాతికేళ్లు
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
అడకత్తెరలో కేసీఆర్
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments