తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం

Cause for Jayalalitha's health issue

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంబారినపడ్డారు. తమిలనాట ప్రజలు ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో అమ్మ పరిస్థితి ఎలా ఉండబోతోందో? అని అందరూ కలవరపడుతున్నారు. అమ్మ ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థనలు చెయ్యండి అంటూ అపోలో ఆస్పత్రి చేతులెత్తేసింది. అయితే ఇక్కడ జయలలిత అనారోగ్యానికి కారణాలను కూడా అందరూ తెలుసుకోవాలి. ఓ రకంగా జయలలిత స్వయంకృతాపరాధం అని ఈ ఆర్టికల్ చదివితే క్లీయర్ గా అర్థమవుతుంది.

జయలలిత డయాబెటిక్ పేషంట్. ఎప్పటి నుంచో ఆమెను ఈ వ్యాధి వేధిస్తోంది. అయినా తిండి విషయంలో కంట్రోల్ లేదు. నచ్చిన ఫుడ్ చక్కగా తినేది అనేది సన్నిహితులు చెబుతుంటారు. మంచి ఆహార ప్రియురాలు కూడా. డయాబెటిక్ ట్రీట్ మెంట్ జరుగుతున్నా.. ఆహారం విషయంలో ఏ మాత్రం శ్రద్ధ తీసుకునేది కాదంటారు. రాష్ట్రానికి సీఎం అయినా.. ఒంటరితనం జయలలితను ఎప్పుడూ వేధిస్తూ ఉండేది. సన్నిహితులు అంటూ ఎవరూ లేరు. ఎప్పుడూ అంత పెద్ద ఇంట్లో ఒంటరి జీవితమే. కాలక్షేపం ఉండేది కాదు. బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా ఎవరితోనూ పంచుకునేది కాదు. తన గుండెల్లోని బాధను చెప్పుకోవటానికి ఆప్తులు, కుటుంబ సభ్యులు దగ్గర లేకపోవటంతో మానసికంగా కుంగిపోయేది.

జయలలిత అంటే ఎంతో మంది జనం గుండెల్లో పెట్టుకుంటారు. కానీ జయకు మాత్రం ఎవరూ సొంతమనుషులు లేకపోవడం ఆమెను అందరిలో ఉన్నా కానీ ఒంటరిని చేస్తోంది. ఇక జయలలిత చాలా తక్కువగా బయటకు వచ్చేవారు. ఎప్పుడూ ఏసీల్లోనే ఉండేవారు. ఇది కూడా ఓ రకంగా జయ అనారోగ్యానికి కారణమైంది. ఇక జయలలిత భారీ శరీరం కూడా ఆమెకు చేటు చేసింది. ఆమె శరీరానికి తగిన ఎక్సర్ సైజ్ అనేది ఉండేది కాదు. ఎక్కువగా కూర్చొనే ఉండటంలో ఒంట్లో ఒక్కొక్క రోగం పుట్టుకొచ్చింది. కిడ్నీ కూడా దెబ్బతిన్నది. ఓవైపు డయాబెటిక్.. కిడ్నీ ప్రాబ్లమ్ తో కాళ్లకు పుండ్లు పడ్డాయి.

జయకు శ్వాసకోశ వ్యాధి కూడా ఉంది. ఊటీ అంటే జయకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఏడాదిలో ఆరు నెలలు అక్కడే ఉండేవారు. నిత్యం చల్లటి వాతారణంలో ఉండటం.. ఇళ్లు, ఆఫీస్, కారు.. ఇలా కాలు బయట పెడితే అంతా ఏసీ మయం. దీంతో ఎండ అనేది తగిలేది కాదు. D విటమిన్ లోపంలో కాళ్ల నొప్పులు వచ్చాయి. ఇటీవల చాలా నిదానంగా నగడవటం, ఏమైనా పట్టుకుని నడవటానికి ఇదే కారణం. ఇలా జయలలిత అనారోగ్యానికి ఆమె సొంతంగా చేసుకున్న తప్పులే అసలు కారణాలు అని చెప్పుకోవచ్చు. అయితే దేశంలో తిరుగులేని జనాదరణ ఉన్న జయలలిత త్వరగా కోరుకోవాలని కోట్లాదిమంది కోరుకుంటున్నారు.

Related posts:
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
మంత్రుల ఫోన్లు బంద్
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
అమెరికా ఏమంటోంది?
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
అమ్మను పంపించేశారా?
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?
251రూపాయల ఫోన్ ఇక రానట్లే

Comments

comments