నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్

CBI Arrested RBI officer

మోదీ సర్కార్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా తాజాగా బడా బాబుల దగ్గర కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు వెలుగులోకి వస్తుండటం వార్తల్లో హైలెట్ గా నిలుస్తోంది. అయితే సామాన్యుడికి రెండు వేలు కావాలంటే గంటల కొద్ది నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అలాంటిది కోట్ల కొద్ది కొత్త కరెన్సీ ఎక్కడి నుండి వస్తోంది అనేది అందరి ప్రశ్న. అయితే ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలతో దాడులు మొదలయ్యాయి. బ్లాక్ మనీనీ దాచిన వాకి గుట్టును రట్టు చేసే పనిలో నిఘా అధికారులు నిమగ్నమయ్యారు.

పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రభుత్వ అధికారులకు చిక్కడం… భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా జరుగుతునే ఉన్నాయి. అయితే కొందరు బ్యాంకు అధికారులు సైతం కాసులకు కక్కుర్తిపడి నల్లకుబేరులకు సహయం చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో సిబిఐ, ఇడి అధికారుల దాడుల్లో బడాబాబులకు నోట్ల మార్పిడిలో సహకరిస్తున్న ఆర్‌బిఐ అధికారి మైఖేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సదరు అధికారి ఇప్పటి వరకు కోటి 50 లక్షల వరకు మార్చినట్టు సిబిఐ అధికారుల విచారణలో తెలింది. ఇంతకుముందే మైఖేల్‌పై ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సిబిఐ అధికారులు తమకు అందిన సమాచారం మేరకు అతడిపై విచారణ చేపట్టారు.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
కాటేసిందని పాముకు శిక్ష
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
బాబోయ్ బాబు వదల్లేదట
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
బాబు బండారం బయటపడింది
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
బెంగళూరుకు భంగపాటే
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
అతి పెద్ద కుంభకోణం ఇదే
వాళ్లకు ఇదే చివరి అవకాశం
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments