పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు

CBI rides on Hyderabad Post Offices

పెద్ద నోట్ల మార్పిడిలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాదాపు ఆరు చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. హిమాయత్‌నగర్ పోస్టాఫీస్‌లో 40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు. డిపాజిట్లు, నగదు మార్పిడిపై సీబీఐ అధికారులు పోస్టాపీస్ సిబ్బందిని ప్రశ్నించారు. ఆబిడ్స్‌ జీపీవో, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌ పోస్టాపీసుల్లో ఏకకాలంలో దాడులు చేశారు. పోస్టాఫీసులపై దాడుల చేసేందుకు సీబీఐ అధికారులు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు.

కార్యాలయాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో పోస్టల్ విజిలెన్స్ అధికారులు సైతం పాల్గొన్నారు. కేంద్ర నిర్ణయంతో నల్లకుబేరులు వివిధ రూపాల్లో డబ్బును మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే నగదుపై పన్ను వసూల్ చేస్తారని పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్లు, నగదు మార్పిడులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు మార్పిడులకు సైతం సిబ్బంది సహకరించటంతో అక్రమార్కులు యధేచ్చగా బ్లాక్ మనీని వైట్ గా మార్చుకున్నట్లు సమాచారం.

ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. బ్యాంకులు సహా పోస్టాఫీసుల్లో కోట్లల్లో పాత కరెన్సీ మార్పిడి మార్చుకుంటున్నారు. ప్రతి మార్పిడికి కొన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్న నిబంధన ఉన్నా… కొన్ని పోస్టాఫీసుల్లో అధికారులు, సిబ్బంది దీన్ని అతిక్రమించారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదులు అందటంతో ఏకకాలంలో దాడులు చేశారు అధికారులు.

నోట్ల మార్పిడిలో అవకతవకలతోపాటు డిపాజిట్లు, సేవింగ్‌‌ ఖాతా జమల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 10 తర్వాత జరిగిన అన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు, సేవింగ్‌ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సీబీఐ అధికారులు. కొన్ని అనుమానాస్పద పార్శిల్స్ పైనా దృష్టిపెట్టారు అధికారులు. వాణిజ్య ప్రాంతాల నుంచి ఉత్తరాదితో పాటు ఇతర చోట్లకు వెళ్లిన కొన్ని పార్శిల్స్ వ్యవహారాలపై సీబీఐ ఆరా తీస్తోంది.

Related posts:
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
ఆయనకు వంద మంది భార్యలు
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
సౌదీలో యువరాజుకు ఉరి
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఆ సిఎంను చూడు బాబు...
చంద్రబాబు చిన్న చూపు
ఏపీకి ఆ అర్హత లేదా?
అమెరికా ఏమంటోంది?
BSNL లాభం ఎంతో తెలుసా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
జయ మరణం ముందే తెలుసా?
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
దేశభక్తి అంటే ఇదేనా?
మోదీ మీద మర్డర్ కేసు!
ఒక్క రూపాయికే చీర

Comments

comments