బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..

Central Govt decalre slab on Gold

పాత పెద్దనోట్లను రద్దుచేసి 23రోజులైంది. దీనిపై సామాన్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు..ఇప్పుడు తాజాగా ఐటీ శాఖ ప్రజలను మరో సంకట స్థితిలోకి నెట్టింది..బంగారంపై ఐటీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వివాహం అయిన మహిళ వద్ద 500 గ్రామాల బంగారం..అవివాహిత మహిళల వద్ద 250 గ్రాములు.. అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా వివాహిత మహిళలు వేసుకునే మంగళసూత్రాలపై ఐటీ శాఖ మినహాయింపునిచ్చింది. తాళిబొట్టుపై ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా తెలిపింది.

అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో కొనుగోలు చేసిన‌ బంగారంపై ప‌న్ను విధించే నేప‌థ్యంలో తాము తీసుకోనున్న చ‌ర్య‌ల్లో భాగంగా వార‌స‌త్వంగా వ‌చ్చిన‌, లెక్క‌చూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి ప‌న్నులు ఉండబోవ‌ని సమాచారం.. దీనిపై మహిళల వద్ద నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా వారసత్వంగా వచ్చిన బంగారంపై ఐటీ శాఖ ఏ విధమైన నిబంధనలు విధించనుందో వేచి చూడాలి. కాగా భారత దేశంలో మహిళలు ఎక్కువగా బంగారంపైనే ఖర్చుపెడుతుంటారు. ఇది కుటుంబావసరాలకు పలు విధాలుగా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. మరికొంతమంది బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు.

అరుణ్ జైట్లీ ప్రకటనలోని కీలక అంశాలు:
– వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. సీజ్ లేదు.
– ఒక్కో వివాహిత మహిళ 500 గ్రాముల (అరకిలో) బంగారం ధరించవచ్చు
– వివాహం కాని మహిళలు 250 గ్రాముల బంగారు ఆభరణాలు ధరించవచ్చు
– మగాళ్ల దగ్గర 100 గ్రాముల బంగారానికి మించి ఉండరాదు
– మహిళలు, పురుషుల దగ్గర ఉండాల్సిన బంగారం కంటే అధికంగా అంటే.. అది లెక్కల్లో చూపని డబ్బుతో కొనుగోలు చేసినది అయితే మాత్రమే చర్యలు ఉంటాయి.
– లెక్కల్లో చూపిన డబ్బుతో కొనుగోలు చేసిన బంగారాన్ని సీజ్ చేయరు
– పన్ను మినహాయింపు పొందిన ఆదాయంతో బంగారం కొనుగోలు చేసినా ఇబ్బందులు ఉండవు
– లెక్కల్లో చూపని ఆదాయంతో బంగారం కొనుగోలు చేస్తే ట్యాక్స్ వేస్తారు.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
మా టీవీ లైసెన్స్ లు రద్దు
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
స్టే ఎలా వచ్చిందంటే..
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
పోరాటం అహంకారం మీదే
ఈ SAM ఏంటి గురూ..?
మంత్రుల ఫోన్లు బంద్
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నారా వారి నరకాసుర పాలన
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
మోదీ ఒక్కడే తెలివైనోడా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
బాబుకు గడ్డి పెడదాం
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
వాళ్లకు ఇదే చివరి అవకాశం
ఒక్క రూపాయికే చీర
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments