చెబితే 50.. దొరికితే 90

Central govt propose nex tax for uncountable money

మోదీ దేశంలో ఉన్న నల్లధనం మీద యుద్ధం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పాత 500, 1000నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమా అవుతున్నాయి. అయితే బ్యాంకుల్లో జమ చేస్తున్న అక్రమ ధనంపై కేంద్రం పన్ను మోత మోగిస్తోంది. డిసెంబర్ 30లోపు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంకేవై) కింద మొత్తం ఆదాయాన్ని వెల్లడించి, అందులో 50శాతం పన్నుగా కడితే. ఆదాయ మూలాల గురించి అధికారులు ప్రశ్నించరు. అంతేకాదు… వారిపై సంపద పన్ను, పౌర పన్ను, ఇతర పన్ను చట్టాల కింద ఎలాంటి చర్యలూ తీసుకోరు. అయితే… ఫెమా, పీఎంఎల్‌ఏ, నార్కొటిక్స్‌, నల్లధనం చట్టం వంటి ఉల్లంఘిస్తే చర్యలుంటాయి.

కేంద్రం ఇప్పటి దాకా ఇచ్చిన గడువుమేరకు నల్లధనం మీద వివరాలను వెల్లడించాలని రెండుసార్లు గడువు ఇచ్చింది. అయితే రెండు సార్లు కూడా వెల్లడించని వారి ఆదాయాలను గమనించి, అక్రమంగా ఉన్న డబ్బులు లేదా సంపాదన మీద పన్ను, పన్ను, పెనాల్టీ కలిసి 90 శాతం ముక్కుపిండి వసూలు చేయనున్నారు. ఈ లెక్కన కేవలం సంపాదించిన అక్రమ డబ్బులో కేవలం 10 శాతం మాత్రమే అతడికి చెల్లుతుంది మిలిగిన మొత్తం కేంద్రం సొంతం చేసుకుంటుంది. ఇలా వచ్చిన డబ్బులో 25శాతం నిధులను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వెచ్చిస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ లేదా సెస్ ఉండదు. మొత్తానికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం వల్ల నల్లధనం మూటగట్టుకున్న వారికి మాత్రం పన్నుపోటు తప్పడం లేదు.

Related posts:
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
ఆట ఆడలేమా..?
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
పిహెచ్‌డి పై అబద్ధాలు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
బాబు బిత్తరపోవాల్సిందే..
బాబు బండారం బయటపడింది
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
BSNL లాభం ఎంతో తెలుసా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
డబ్బు మొత్తం నల్లధనం కాదు
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments