బంగారం బట్టబయలు చేస్తారా?

Central govt targets Gold after Demonetisation decision

మన దేశంలో నగదు కన్నా కూడా బంగారం మీద చాలా మందికి నమ్మకం. అందుకే ఎంత తక్కువ సంపాదన చేస్తున్న వారైనా కూడా ఎంతో కొంత బంగారాన్ని వెనకేసుకుంటుంటారు. అయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత అందరి దృష్టి బంగారం మీదకు మళ్లింది. అయితే చాలా మంది బడా బ్లాక్ బాబులు తమ నల్లడబ్బుతో వెంటనే బంగారం మీద పడిపోయారు. అయితే నవంబర్ 8 తర్వాత బంగారం కొనుగోలు, అమ్మకాలపై ఇప్పుడు ఈడీ కొరడా ఝులిపించడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా ఈడీ దాడులకు సిద్ధమతోంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్‌లో జరిగిన పసిడి విక్రయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తును వేగం చేసింది. నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డ క్షణం నుంచి పసిడి విక్రయాలు పెరగడం వెనుక గల అసలు కారణాలను శోధించే పనిలో ఇడి అధికారులు నిమగ్నమయ్యారు. 8 నుంచి 30వ తేదీ వరకు ఒక్క హైదరాబాద్‌లోనే 2700 కోట్ల విలువ చేసే బంగారు బిస్కట్లను బులియన్ వ్యాపారులు విక్రయించినట్లు గుర్తించిందని ఒక ఛానల్  ప్రధానంగా ప్రసారం చేసింది.

నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డ నవంబర్ 8 వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి వరకు దాదాపు 100 కోట్లకు పైగా బంగారాన్ని విక్రయించినట్లు ఒక జ్యువల్లరీ దుకాణం బ్యాంకులో పాత నోట్లను జమ చేసింది. ఈ మొత్తం 5200 మంది వినియోగదారుల నుంచి తీసుకున్నామని ఆ సంస్థ ఇడికి ఇచ్చిన వివరణలో స్పష్టం చేసింది. ఎవరు కొనుగోలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆరా తీయగా, చాలా మంది అజ్ఞ్రాతంలో ఉన్న ట్లు తేలడంతో మరిన్ని అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు కేవలం 10 రోజుల వ్యవధిలో దాదాపు 1500 కిలోల బంగారం హైదరాబాద్‌కు దిగుమతి అయినట్లు ఆయా బ్యాంకులలోని రికార్డులను పరిశీలించిన ఇడి గుర్తించిందని ఆ ఛానల్ పేర్కొంది. కొనుగోలు దారులలో ఎవరెవరున్నారు, వారి వార్షిక సంపాదన ఎంత, బంగారాన్ని స్వల్ప వ్యవధిలో ఎందుకు అధిక మొత్తంలో కొనుగోలు చేయాల్సి వచ్చిందన్న వివరాలపై ఇడి దర్యాప్తు సాగిస్తోంది. నవంబర్ మాసంలో జరిగిన బంగారం కొనుగోళ్ళలో ఎంత మేర గోల్‌మాల్ జరిగిందన్న అంశాన్ని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
సౌదీలో యువరాజుకు ఉరి
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
BSNL లాభం ఎంతో తెలుసా?
గాలిలో విమానం.. అందులో సిఎం
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
డబ్బు మొత్తం నల్లధనం కాదు

Comments

comments