తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?

Central Govt trying to bring Uniform Civil Code

చట్టం అందరికీ చట్టమే.. ఎవరికీ చుట్టం కాదు అని ఓ సామెత. కానీ తాజాగా ఓ చట్టం విషయంలో మాత్రం కేంద్రానికి ఎదురుగాలి వీస్తోంది.  ముస్లీం వివాహ పద్దతి మరియు విడాకుల పద్దతి మహిళలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. మూడు సార్లు తలాక్‌ అని మహిళలు అంటే విడాకులు అయిపోయినట్లే. అయితే ఈ పద్దతిని తొలగించాలని చాలా కాలంగా ముస్లిం మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. కాని ముస్లిం పెద్దలు మాత్రం అందుకు ససేమేర అంటున్నారు. తాజాగా భారత ప్రభుత్వం చట్టంలో సవరణ తీసుకు రావాలని, అన్ని వివాహ చట్టాలను ఉమ్మడి పౌరస్మృతి(Uniform Civil Code) కిందకు తీసుకు రావాలని నిర్ణయించారు.

భారతదేశంలోని అన్ని మతాలు మరియు జాతులు కూడా ఒకే చట్టం కిందకు తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అప్పుడే అడ్డుతట్టింది. తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన ప్రతిపాదనను ముస్లిం మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని అన్ని మతాలతో పోల్చితే ముస్లింలలోనే అతి తక్కువగా విడాకులు ఉన్నాయి అని వారు అంటున్నారు. దేశ ప్రజలందరిని ఒకే గాటున కట్టడం అనేది సాధ్యం కాని విషయం అని, అలా చేయడం వల్ల బహుళత్వం మరియు భిన్నత్వంలు(Diversity and Plurality) దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించింది. దాంతో కేంద్రం తీసుకు రావాలని భావిస్తున్న ఉమ్మడి చట్టం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మొత్తానికి కేంద్రం అనుకున్నట్లుగా తలాక్ తాట తీసి ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువస్తుందా..? లేదా..? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
తాగుబోతుల తెలంగాణ!
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ఈ SAM ఏంటి గురూ..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
జగన్ సభలో బాబు సినిమా
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే

Comments

comments