అవినీతి ఆరోపణల్లో రిజిజు

Central Minister Rijiju in scam

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుపై ఆవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కామెంగ్‌లో రూ.450కోట్ల ఖర్చుతో నిర్మించిన హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల ను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాయడం రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ కుంభకోణంలో మంత్రి కిరణ్ రిజిజుకు పాత్ర ఉందని, వెంటనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.

రిజిజు సోదరుడు గోబొయి రిజిజు అరుణాచల్‌లో కాంట్రాక్టర్ అని, అతడికి ఈ కుంభ కోణంతో సంబంధం ఉందని, మంత్రి మద్దతు కూడా కాంట్రాక్టర్‌కు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తమ వద్ద 28నిమిషాల నిడివితో కూడిన ఆడియో రుజువులు ఉన్నాయని రణదీప్ వాటిని విడుదల చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి చర్యలకు పాల్పడనని, ఇతరులను పాల్పడనివ్వనని చేసిన ప్రతిజ్ఞలను ప్రతిపక్ష కాంగ్రెస్ గుర్తు చేసింది. మోదీ అవినీతి పోరాటం చేస్తున్నానని అంటున్నారు.. మరి అవినీతి ఆరోపణలున్న మంత్రితో అది ఎలా సాధ్యం అని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

600మెగావాట్ల కామెంగ్ హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఈశాన్య విద్యుత్ కార్పొరేషన్(ఎన్‌ఇఇపిసిఒ) చీఫ్ విజిలెన్స్ అధికారి సతీశ్ వర్మ, గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి అందులో రూ.400కోట్ల మేరకు అవినీతి జరిగిందని పేర్కొంటూ సిబిఐ, సివిసి, కేంద్ర విద్యుత్ శాఖలకు ఒక నివేదిక పంపినట్లు వార్తలు వెలువడడంతో వివాదం రాజుకుంది. రిజిజు, అతడి వరుసకు బ్రదర్ కాంట్రాక్టర్ అనేక మంది ఉన్నతస్థాయి ఎన్‌ఇఇపిసిఒ అధికారులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. మరి దీనిపై మోదీ అండ్ కో ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
ఆరిపోయే దీపంలా టిడిపి?
ఆట ఆడలేమా..?
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నయీం బాధితుల ‘క్యూ’
ఏపీ బంద్.. హోదా కోసం
స్థూపం కావాలి
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
పిహెచ్‌డి పై అబద్ధాలు
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
ఏపీకి ఆ అర్హత లేదా?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
అమ్మను పంపించేశారా?
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
అందుకే భూకంపం రాలేదట
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments