కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది

Central Minister Sadananda Gowda faced problem with demonetisation

సినిమాలకు, రాజకీయాలకు ఓ లింక్ ఉంటుంది. అదేమిటంటే సినిమాల్లో పేలే డైలాగులు అప్సుడప్పుడు రాజకీయ పరిస్థితులకు బాగా సింక్ అవుతాయి. తాజాగా దేశంలో పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందే. నోట్ల రద్దు ప్రభావం దేశం మొత్తం కనిపిస్తోంది. అయితే దీనిపై మహేష్ బాబు సినిమాలో డైలాగును బాగా ఆపాదింవచ్చు. జనాల మీద మోదీ ప్రభావం ఎలా ఉన్నా కానీ ఓ శవం మీద మాత్రం నోట్ల ప్రభావం కనిపించింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. మంత్రిగారి తమ్ముడి శవం మీదనే ఈ ప్రభావం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అసలు మ్యాటర్ ఏమిటంటే..

మోదీ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాత నోట్లను మార్చుకోవడంలో జనాలు చాలా ఇబ్బందిపడుతున్నారు. కాగా కొన్ని వెసలుబాటులను కల్పిస్తున్న కేంద్రం ఆస్పత్రుల్లో పెద్ద నోట్లు చెల్లుతాయి అని ప్రకటించింది. కానీ దీని బండారం ఏమిటో కేంద్ర మంత్రి సదానందగౌడకు ఎదురైన చేదు అనుభవంతో తేలిపోయింది. గతంలో న్యాయశాఖ మంత్రి గా ఉన్న సదానంద గౌడ తమ్ముడు భాస్కర గౌడ మంగుళూరులోని కస్బూర్బా ఆస్పత్రిలో చనిపోయాడు.

భాస్కర్ గౌడ చనిపోగా బంధువులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాతనోట్లు ఇవ్వబోతే తీసుకులేదు. మంత్రి జోక్యం చేసుకుని చెప్పినాఫలితం లేకపోయింది. ఈ విషయం లిఖిత పూర్వకంగా చెప్పాలని ఆయన అడిగితే నిరభ్యంతరంగా రాసిచ్చారు. తర్వాత ఆయన చెక్కు రాసి ఇచ్చి మృతదేహం తీసుకుని బయిటపడ్డారు. పైగా ఆస్పత్రి ఎండి సంఘీర్‌ సిద్దిక్‌ తమకు రిజర్వు బ్యాంకు నుంచి అలాటి ఆదేశాలేమీ రాలేదని ఖచ్చితంగా దాని నిబంధనల ప్రకారమే చేశామని చెప్పడం విశేషం. కేంద్ర మంత్రిగారి కుటుంబ సభ్యుడిగా ఇలాంటి దీనస్థితి ఏర్పడితే మామూలు జనాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి దాకా నల్లధనం మీద తాను యుద్ధం చేస్తున్నానని జబ్బులు చరిచిన మోదీ ఈ పరిణామం మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts:
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
జయ మరణం ముందే తెలుసా?
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
అవినీతి ఆరోపణల్లో రిజిజు
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments