షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి

Central Minister Venkaiah naidu announce vehicle registration condition

మోదీ సర్కార్ రూటే సపరేటు అన్నట్లుంది. అసలు ఎప్పుడు ఏ మంత్రి, ఏ అధికారి నుండి షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని అందరూ భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. వాహనదారులకు షాకిచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ వద్ద పార్కింగ్ స్థలం ఉన్నట్టు అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దీనిపై ఓ ప్రకటన చేశారు.

వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడమే కాకుండా మరిన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. భవన నిర్మాణాల సమయంలో టాయిలెట్లకు స్థలం కేటాయించని వాటికి నిర్మాణ అనుమతి ఇవ్వబోమని, పార్కింగ్ ప్లేస్ సర్టిఫికెట్ లేని వాహనాలను రిజిస్ట్రేషన్‌కు అనుమతించబోమని తెలిపారు. ఈ విషయమై రవాణా మంత్రిత్వ శాఖతో తన శాఖ చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

అంతకుముందు వెంకయ్యనాయుడు ‘గూగుల్ టాయిలెట్ లొకేటర్‌’ను ప్రారంభించారు. దీనిద్వారా ప్రజలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు ఇండోర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ప్రజలు సమీపంలోని టాయిలెట్లను వెదికే వీలుంటుంది. గూగుల్ టాయిలెట్ లొకేటర్‌లో ప్రస్తుతం షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, బస్, రైలు స్టేషన్లు, పెట్రోలు పంపులు, మెట్రో స్టేషన్లలో ఉన్న 6,200 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా మొత్తానికి వెంకయ్య నాయుడు భలే ఇరకాటంలో పెట్టేశారు. నొప్పి తెలియకుండానే వాతపెట్టే ప్రయత్నం చేస్తోంది మోదీ సర్కార్.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
అడవిలో కలకలం
అమెరికా ఏమంటోంది?
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
బాకీలను రద్దు చేసిన SBI
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
అమ్మ పరిస్థితి ఏంటి?
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
ఒక్క రూపాయికే చీర
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments