మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్

Central Ministers fears Modi Decision

గతకొంత కాలంగా వినిపిస్తున్న కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు అంతా సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతో కాలంగా పలానా మంత్రులకు ఊస్టింగ్ ఖాయం అంటూ వచ్చిన వార్తలకు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. మంత్రుల పనితీరు బేరీజు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 30న జరగబోయే కేబినెట్‌లో భేటీలో మంత్రులు స్వీయ నివేదిక సమర్పించాలని ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే సమర్పించిన నివేదికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.

మంత్రులు తమ సెల్ఫ్ రిపోర్ట్‌ను తయారు చెయ్యాలట. అందులో గత రెండేళ్ల పాలనా కాలంలో శాఖా పరంగా తాము సాధించిన విజయాలు, సమస్యలను అధిగమించిన తీరు లాంటి అన్ని అంశాలను అందులో వివరించాలట. అలా అందించిన రిపోర్ట్ ను తన సొంత రిపోర్ట్‌తో పోల్చి చూసుకొని కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు ప్రధాని మోడీ స్కెచ్ రెడీ చేశారని తెలుస్తోంది. ప్రక్షాళనలో భాగంగా అసమర్ధ మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి ముఖ్యంగా యువతకు అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు. అలాగే కొందరు మంత్రులకు శాఖల మార్పిడి కూడా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో మంత్రులు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు తమ తమ రిపోర్ట్‌లను తయారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

Related posts:
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
పవర్ లేని పవర్ ?
బాబు ఏమన్నా గాంధీనా?
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments