కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం – చంద్రంబలి

chandrambali

బలం బాగేలేనప్పుడు బల్లిపామై కరవడం అన్నా.. బలం లేనప్పుడు అరటి పండు తిన్నా పళ్లు విరగడం అన్నా.. ఇలాంటివి ఎన్ని సామెతలు ఉంటే అన్నీ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వర్తిస్తాయి. ఏపి ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులకు తోడు తాజాగా దురదృష్టం కూడా బాగా వెన్నంటినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు జగన్ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తుంటే.. కొత్తగా లేని తలనొప్పులు చంద్రబాబుకే వస్తున్నాయి.

ఏపిలో ప్రస్తుతం రెండు అంశాలపై తీవ్రంగా చర్చ సాగుతోంది. అవి ఒకటి ప్రత్యేక హోదా అంశం. రెండోది కాపు ఉద్యమం. ఏపికి ప్రత్యేక హోదా ప్రకటన వస్తుంది అనుకున్న టైంలో అందరికి షాకిచ్చేటట్లు కేంద్రం ప్రత్యేక హోదా లేదు అని చేతులెత్తేసింది. దాంతో ఏపి మొత్తం ఆవేశంతో ఊగిపోతోంది. ఎన్నికల సందర్భంగా ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపి అధికారంలోకి రాగానే మాట మార్చడం మీద ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. కాగా చంద్రబాబు నాయుడు వల్లే కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చంద్రబాబుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోపక్క కాపు రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇంతకుముందు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గరపడ్డంతో కాపునేతలు ఉద్యమ నిర్మాణం ,నిర్వహణపై మరోసారి దృష్టి పెట్టారు.ఇప్పటికే కాకినాడలో సమావేశమై జిల్లాలవారీ జాక్ లపై పని దాదాపుగా పూర్తి చేశారు.ఇప్పుడు నాయకత్వ పరంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి కాపు పెద్దలు కుస్తీ పడుతున్నారు.ఇంతకు ముందు నిరాహారదీక్షలతో ఉద్యమాన్ని నడిపిన ముద్రగడ అప్పట్లోనే ఇక జాక్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు.

ఏపిలో కాపుల ఉద్యమం నిజానికి ప్రత్యేక హోదా అంశానికి ముందే ఉన్నా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అది కొన్ని రోజులు మరుగున పడింది. కానీ ఇప్పుడు మరోసారి కాపు నాయకులు ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాగా ఆ రెండు అంశాలు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి. కనీసం తెలుగు తమ్ముళ్లు కూడా ఈ రెండింటిపై తమ నాయకుడిని వెనకేసుకోలేని పరిస్థితి ఏర్సడింది. మరి ఈ రెండింటికి చంద్రబాబు బలి అవుతున్నడా అంటే.. అవుననే సమాధనం వస్తుంది. మరి చూడాలి చంద్రబాబు ముందు ముందు ఎలాంటి పరిస్థితులను ఎదర్కొంటారో..?!

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
బాబు Khan
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
తొక్కితే తాటతీస్తారు
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments