నారా వారి నరకాసుర పాలన

Chandrababu Naidu administration like narakasura

ఏపిలో నరకాసుర పాలనసాగుతోంది. అవును ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి లోపల ఉన్న భావన ఇదే. తాజాగా చంద్రబాబు నాయుడు పోకడలు చూస్తే ఇలాంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి అందులో ఎవరికి ఎలాంటి అడ్డంకి లేదు. ప్రజలకు సుపరిపాలన అందించాలి అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ వాటి పేరుతో అరాచకాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతఘటన ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా వైసీపీ, చంద్రబాబు నాయుడు తీసుకునే ఓ నిర్ణయం మీద తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇంతకీ ఆ ప్రతిఘటనకు కారణం ఏంటి అనుకుంటున్నారా..? బీచ్ లవ్ పేరుతో చెయ్యాలని అనుకుంటున్న ఓ కార్యక్రమం.

అవును.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెయ్యడానికి, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు విశాఖ బీచ్ లో బీచ్ లవ్ పేరుతో నిర్వహించే కార్యక్రమం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మహిళా సంఘాలు ఇప్పటికే వ్యతిరేకతను తెలిపాయి. మహిళలంటే ముందు నుండి గౌరవంలేని చంద్రబాబు నాయుడు కావాలనే ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా దీనిపై వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు.

నారావారి నరకాసుర పాలన పోవాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా దీనిపై ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని రోజా వెల్లడించారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం రిషికొండతో పాటు మరో రెండు బీచ్ లను పరిశీలించింది. కాగా విశాఖలో బీచ్ లవ్ జరిగితే మాత్రం గోవా తరహాలో కల్చర్ మొత్తం మారుతుందని, సెక్స్ రాకెట్, డ్రగ్ మాఫియా పెచ్చుమీరుతుందని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయినా పర్యాటకులను ఆకట్టుకునేందుకు బీచ్ లవ్, బికినీ పార్టీలు ఇవ్వడం ఏంటో అని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా పోయేకాలం కాకపోతే ఏంటిది అని కొంత మంది ఛాందసవాదులు మండిపడుతున్నారు. మరి ఈ బీచ్ లవ్ ఎలా జరుగుతుందో చూడాలి.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
తాగుబోతుల తెలంగాణ!
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
బాకీలను రద్దు చేసిన SBI
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
BSNL లాభం ఎంతో తెలుసా?
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
గాలిలో విమానం.. అందులో సిఎం
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?

Comments

comments