చంద్రుడి మాయ Diversion Master

Chandrababu Naidu behind Pawan kalyan

చంద్రబాబు నాయుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు జాతీయ స్థాయిలో కూడా పేరెన్నికగన్న పేరు. తెలుగుదేశం పార్టీ అధినేతగా, ఉమ్మడి రాష్ట్ర సిఎంగా చంద్రబాబుక ఉన్న పేరుకన్నా రాజకీయ చాణిక్యుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఏపిలో ఉన్నట్టుండి రాజకీయ తెర మీదకు పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అందరూ షాక్ తిన్నారు.  2014లో జనసేన పార్టీని స్థాపించినా కానీ రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల తర్వాత ఎందుకు ప్రత్యేక హోదా అనే పాత నినాదాన్ని కొత్త జాడీలో వేసి పవన్ ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన తర్వాత నుండి వినిపిస్తున్న అంశం ప్రత్యేక హొదా. అందరూ దీనిపై కావాలి కావాలి అనే అంటున్నారు ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దీనిపై స్పందించడంలేదు. దీని సంగతి పక్కనబెడితే ఏపిలో ప్రభుత్వం మీద అంతకంతకు అసమత్తి పెరుగుతోంది. వివిధ వైఫల్యాలు, కాల్ మనీ, సెక్స్ రాకెట్, అసెంబ్లీలో తీరు, ఓటుకు నోటు, అమరావతి కోసం అంటూ  బలవంతంగా భూసేకరణ, సచివాలయం కుంగిపోవడం, దేశంలోనే అవినీతిలో ఏపి నెంబర్ వన్ గా, మారడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండటం ఇలా అన్ని వెరసి చంద్రబాబు నాయుడు ఇమేజ్ కు డ్యామేజ్ ఏర్పడింది. తాజాగా చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేలో కూడా ఇదే తేలింది.

Also Read:   పవన్ చంద్రుడి చక్రమే

కేవలం సగం మంది ప్రజలు కూడా తనతో లేరని తెలుసుకున్న చంద్రబాబు అంతకంతకు జగన్ కు పెరుగుతున్న గ్రాఫ్ కు భయపడి పవన్ ను రంగంలోకి దింపారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు అంటే చంద్రబాబు పాలనపై స్వయంగా నిర్వహించిన సర్వేలో ప్రభుత్వానికి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి అని తెలుసుకున్న తర్వాత పవన్ హుటాహుటిని ఎందుకు మీటింగ్ పెట్టారు అన్నది ప్రశ్న. పైగా చకచకా పవన్ సభకు ఏర్పాట్లు, అనుమతులు అన్ని దొరకడం వెనక కూడా ఏ మాయాలేదని అంటారా..?

Also Read: పవన్ పోరాటం రాజకీయమే… చిత్తశుద్దిలేని పవన్

ఏపి రాజకీయాలను, చంద్రబాబు నాయుడును దగ్గరి నుండి గమనించిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాయే పవన్ మీద పనిచేస్తోంది అని ఖచ్చితంగా అంటారు. పవన్ ను తెర మీదకు తెచ్చిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గురించి గొప్పలు చెప్పిన బాబు.. ఆయనను కరెక్ట్ టైంలో వాడినట్లు తెలుస్తోంది. మొత్తంగా చంద్రుడి మాయ ఏపిలో ప్రత్యేక హోదా అంటూ కొత్త రాగం పాత పల్లవి అందుకున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని జగన్ చేతిలోనుండి లాక్కొని పవన్ చేతికి అందించడం, ప్రజల దృష్టిమళ్లించారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడును మాయ చేశారని అందరికి తెలిసిపోయింది.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
అడకత్తెరలో కేసీఆర్
పవన్ ను కదిలించిన వినోద్
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మూడింటికి తేడా ఏంటి..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
తొక్కితే తాటతీస్తారు
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?

Comments

comments