పుష్కరాల్లో సెల్ఫీ బాబూ

SelfieRaja

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఆలోచనలు యువకుల్ని కూడా ఆకర్షించేలా ఉంటాయి. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ చంద్రబాబు నాయుడు కుర్రాడే. తాజాగా పుష్కరాల్లో కూడా తన మార్క్ మాటలతో యూత్ లో జోష్ పెంచారు. పుష్కరాల్లో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాల సైట్లైన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో నింపేయండి అంటూ పిలుపునిచ్చారు. అదేంటి సెల్ఫీలు దిగి చంద్రబాబు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారా..? ఈ రకంగా కృష్ణా పుష్కరాలను జనాల్లోకి బాగా తీసుకెళ్లవచ్చని ఆయన ఆలోచన కావచ్చు.

‘తమ్ముళ్లూ ఒకప్పుడు ఒక్కరో ఇద్దరో కెమెరా మెన్లో ఉండేవారు.. ఇప్పుడు సెల్‌ఫోన్ ఉన్న వారంతా కెమెరా మెన్ లు అయిపోతున్నారు’ అంటూ చంద్రబాబు తన మాటలతో యూత్ ను ఆకట్టుకున్నారు. ‘మీరు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి చేసే పుష్కర స్నానాల ఫొటోలను తీయడంతో మరిచిపోవద్దు.. వాటిని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో అప్‌లోడ్‌ చేయండి’ అంటూ సూచించారు. ‘సామాజిక మాధ్యమాల్లో మీ కేరింతల్ని చూసి మరో పది మంది పుష్కర స్నానాలకు వస్తారు.. ఆ పది మంది వంద.. వంద వెయ్యి, వెయ్యి లక్ష మంది అవుతార’ని అన్నారు.

మొత్తానికి హైటెక్ బాబుగారి సెల్ఫీ హైటెక్ గా ఉందని కొంత మంది తారీఫ్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం ఇదేంటి ఆయన నోటి నుండి ఇలాంటి మాటలు రావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం మొత్తం సెల్ఫీల గోల వల్ల జనాలు చనిపోతుంటే.. చంద్రబాబు మాత్రం పుష్కరాల్లో సెల్ఫీలు దిగండి అంటూ పిలుపునివ్వడం ఏంటా అని పెదవివిరుస్తున్నారు. అసలే నది, అందునా జనాలు మరి సెల్ఫీల పిచ్చితో ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటున్నారు..? అయినా పాజిటివ్ గా ఉంటే అంతా ఓకే అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.

Related posts:
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆట ఆడలేమా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
అడవిలో కలకలం
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
అమెరికా ఏమంటోంది?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
ఛాయ్‌వాలా@400కోట్లు
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments