తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం

Chandrababu Naidu can escape from Cash for Vote case

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు తీవ్ర దుమారానికి దారి తీసింది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు మీద తెలంగాణ ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ ఏసీబీ.. తర్వాత స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియోను, స్టింగ్ ఆపరేషన్ చేసిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్వేగాలు రేగేలా పరిస్థితి మారింది. చివరకు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. కాగా తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసుకు సంబందించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఈ కేసులో నుంచి చంద్రబాబు నాయుడు నిర్దోశిగా బయటపడేందుకు(నిరూపించేందుకు)అవకాశాలున్నాయా..? అని విశ్లేషిస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలను తెలుపుతూ తెలుగోడ చేసిన ప్రత్యేక విశ్లేషణ మీకోసం.

ఓటుకు నోటు కేసులో విడుదలైన ఆడియో టేపులో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు డీల్ గురించి కానీ.. రేవంత్ రెడ్డి పేరుకు కానీ ప్రస్తావించలేదు. అసలు రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. చంద్రబాబు నాయుడు మాత్రం ‘‘వాళ్లు ఏదైతే మాట్లాడారో దానికి కట్టుబడి ఉన్నాను.. మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి’’అని అన్నారు. మరి ఇక్కడ ఎక్కడా డబ్బుల వ్యవహారం లేదు. కేవలం స్టీఫెన్ సన్ కు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండని మాత్రమే అన్నారు.

ఆడియో టేపులోని సంభాషణ:
చంద్రబాబు: హలో
స్టీఫెన్ సన్: సార్, గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు: గుడ్ ఈవెనింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ(ఎలా ఉన్నారు)
స్టీఫెన్ సన్: ఫైన్.. ధ్యాంక్యూ సార్.. (బాగున్నాను)
చంద్రబాబు: మనవాళ్లు బ్రీఫ్డ్ మి.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్(మన వాళ్లు చెప్పారు.. నేను మీతో ఉన్నాను.. కంగారుపడాల్సినపనేంలేదు)
స్టీఫెన్ సన్: యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్.. విల్ హానర్..(నేను మీతో ఉన్నాను.. మన వాళ్లు ఏదైతే మాట్లాడారో దానికి కట్టుబడి ఉన్నాను)
స్టీఫెన్ సన్: యస్ సార్.. రైట్ సార్(సరే)
చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్ నో ప్రాబ్లం ఎలాట్(స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు)
స్టీఫెన్ సన్: ఓకే సార్
చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్మెంట్.. వి విల్ వర్క్ టుగెదర్ (ఇది హామీ, మనం కలిసి పనిచేద్దాం)
స్టీఫెన్ సన్: రైట్ సర్.. థ్యాంక్యూ సార్

ఇక అన్నింటికి మించి ఈ మొత్తం వ్యవహారంలో ముందు నుండి ఎంతో కీలకంగా ఉన్నది తెలంగాణ టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి. తనకు, స్టీఫెన్ సన్ ల మధ్యన జరిగిన చర్చలకు, చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదు అని రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీ ముందు చెప్పాలి. దాని వల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటి.. కానీ నేను చేసింది ఒకటి అని అప్రూవల్ గా మారితే కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఇరుక్కుంటారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకుంటారు.

అలాకాకుండా చంద్రబాబు నాయుడును కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తే మాత్రం తెలంగాణ సిఎం కేసీఆర్ కు కూడా ఇది చుట్టుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలోనూ సిఎం స్థాయి వ్యక్తుల ఫోన్ లను ట్యాపింగ్ చెయ్యడానికి వీలులేదు. మరి చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఉన్నట్లు తేలితే మాత్రం ట్యాపింగ్ కూడా వెలుగులోకి వస్తుంది. దానితో కేసీఆర్ కు కూడా గండం వస్తుంది. ఇలా ఇద్దరు సిఎంలకు ఈ కేసు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి కాబట్టి దీన్ని అక్కడిదాకా తీసుకెళ్లేందుకు ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఈ కేసు నుండి తప్పించుకోవచ్చు.

ఈ కేసులో గమనించాల్సిన అంశం ఇంకొకటి కూడా ఉంది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో కేవలం ఒకటి మాత్రమే మీడియాకు చిక్కింది. అలాకాకుండా మరిన్ని ఆడియోలు లేదంటే వీడియోలు ఉంటే మాత్రం అది చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారడం తధ్యం. అలాంటి టైంలో తెలంగాణ ఏసీబీ పని చేసే తీరు కూడా ఎంతో కీలకంగా మారుతుంది. తెలంగాణ ఏసీబీ వద్ద ఉన్న (ఒకవేళ ఉంటే, ప్రజలకు తెలియని) వాటిని రెండు రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎప్పటికి బయటకు రాకుండా చెయ్యగలగితే ఓటుకునోటు కేసులో ఇద్దరు సిఎంలకు శాశ్వతంగా తలనొప్పిపోతుంది.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
పవన్ మాస్టర్ స్కెచ్
పట్టిసీమ వరమా..? వృధానా..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments