బాబు బండారం బయటపడింది

Chandrababu Naidu cheated everyone on Industrial summitt name

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మీడియా మేనేజ్‌మెంట్ లో డాక్టరేట్ లేదు కానీ అంతకు మించి తెలివితేటలు మాత్రం బాబు దగ్గర మెండుగా ఉన్నాయి. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అసలు ఏమీ లేకున్నా అరచేతిలో వైకుంఠాన్ని చూపించే సత్తా.. నేర్పు ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉంది. తాజాగా ఆయన బిల్డప్ లకు ఓ బలమైన సాక్షం దొరికింది. అయ్యవారు మీడియాలో తన చరిష్మాను పెంచుకునేందుకు వేసిన అతి ప్లాన్.. భారీ ఖర్చు వెలుగులోకి వచ్చింది. కేవలం మూడు రోజులకు ఏడు కోట్లు ఖర్చు చేశారు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవును అక్షరాల ఏడుకోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

గత సంవత్సరం విశాఖపట్నంలో నిర్వహించిన బిజినెస్ సమ్మిట్ లో చంద్రబాబు సర్కార్ చేసిన ఖర్చు అక్షరాల ఏడు కోట్ల రూపాయలు. ఈ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు తాత్కాలిక నివాసం, క్యాంఫ్ ఆఫీస్..కిచెన్ ల నిర్మాణానికి చేసిన వ్యయం అది. అదీ ఎక్కడ నుంచి సమకూర్చారు అంటారా?.  రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి చెల్లించే పారిశ్రామిక రాయితీల ఖాతా నుంచి ఈ నిధులను చంద్రబాబు కోసం వెచ్చించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కోట్లు కేవలం సీఎం తాత్కాలిక నివాసం కోసం ఇంత ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ (ఉమ్మడి రాష్ట్ర) చివరి స్పీకర్ నాదెండ్ల మనోహర్ బహిర్గతం చేశారు.

భాగస్వామ్య సదస్సుకు హాజరైన 1500 మంది డెలిగేట్స్‌కు ఇచ్చిన పెన్ డ్రైవ్ లు.. కిట్ల కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు వ్యయం చేశారని..  ఇవన్నీ అధికారిక డాక్యుమెంట్లు చెబుతున్న లెక్కలే అని నాదెండ్ల వివరించారు. ఇక ఈ సదస్సు నిర్వహణ కోసం సర్కారు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు చెల్లించిన మొత్తం…విశాఖపట్నం అర్భన్ డెవలప్ మెంట్   సంస్థ చేసిన వ్యయం కోట్లలోనే ఉంది. భాగస్వామ్య సదస్సు సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలపై నాదెండ్ల మనోహర్ కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఇఫ్పటి వరకూ వచ్చిన పెట్టుబడులకు సంబంధించి స్టేటస్ రిపోర్టు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

భాగస్వామ్య సదస్సు అంతా ఓ బోగస్ లా ఉందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ సదస్సు ద్వారా 361 ఎంవోయూల ద్వారా 4.86 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని..కానీ ఇంత వరకూ ఎన్ని పరిశ్రమలు వచ్చాయో తెలియదన్నారు. ప్రభుత్వం తమ అవినీతి భయపడుతుందనే ఎంవోయూల వివరాలను బహిర్గతం చేయటంలేదన్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు బండారం మరోసారి బయటపడింది. అయ్యవారు పెట్టుబడుల పేరుతో చేస్తున్న దుబారా ఖర్చు మీద గతంలోనే నేషనల్ మీడియా కూడా వార్తలను ప్రసారం చేసింది. కానీ బాబుగారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అయితే రాష్ట్రం అసలే ఆర్థికంగా కష్టాల కడలిలో ఉంది అని చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్ర ఖజానాను మాత్రం ఇలా దుబారాగా వాడితే మాత్రం రాష్ట్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
కాశ్మీర్ భారత్‌లో భాగమే
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
మంత్రుల ఫోన్లు బంద్
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
ఆ సిఎంను చూడు బాబు...
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
అమ్మ పరిస్థితి ఏంటి?

Comments

comments