బాబుగారి చిరు ప్లాన్

Chandrababu Naidu chiru plan for politics

ఏపిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ మార్పులను గమనించడంలో ఎంతో పేరున్న నారా చంద్రబాబు నాయుడు వేస్తున్న అడుగులు కొత్త సమీకరణలకు తెర తీస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన వ్యతిరేక పరిస్థితుల దృష్యా చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవితో సంధికి సిద్దమవుతున్నట్లు అనిపిస్తోంది. అయితే నేరుగా చిరంజీవితో కాకుండా చిరంజీవి కొడుకు రాంచరణ్ తేజ్ కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కంపెనీకి మేలు చేసి… ఆ రకంగా పరోక్షంగా చిరుతో స్నేహం చేస్తారు అని టాక్ నడుస్తోంది.

ఇప్ప‌టి నుంచే చిరును లైన్‌లో పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో ఫ‌స్ట్ స్టెప్‌గా చిరు కుమారు రాం చ‌ర‌ణ్‌కి చెందిన ట్రూజెట్ విమాన సంస్థ‌ను న‌ష్టాల నుంచి బ‌య‌ట‌కు తెచ్చేందుకు య‌త్నిస్తున్నార‌ట బాబు. ప్ర‌స్తుతం ప్ర‌యాణికులు లేక ఈ సంస్థ ఈగ‌లు తోలుకుంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దాంతో లాభాలులేని మార్గాల్లో విమాన సర్వీసులను నడిపితే కలిగే నష్టాలను ప్రభుత్వం కొంత వరకు భరించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ట్రూజెట్ విమాన సర్వీసుకు రెండు దఫాలుగా ప్ర‌భుత్వ ల‌య‌బిలిటీ ఫండ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.10 కోట్ల వ‌ర‌కు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

కాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడికి చెందిన విమాన సంస్థకు చంద్రబాబు నాయుడు చేస్తున్న మేలు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా చంద్రబాబుకు చిరు చేరువైతే కలిసి వచ్చేది కాపు సామాజిక వర్గం. రిజర్వేషన్లు కల్పించలేదని కోపంగా ఉన్న కాపు వర్గీయులను తన మాస్టర్ ప్లాన్ తో చిరు ద్వారా తగ్గించాలని ప్రయత్నిస్తున్నారని వినికిడి. ఇక మరోపక్క పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా మారతారో అంచనా వెయ్యలేము కాబట్టి ముందు జాగ్రత్తగా చిరుతో మంచి సంబంధాలు ఉంటే బెటర్ అని బాబు ఆలోచన అనేది మరో వాదన. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి త్వరలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి.. సైకిలెక్కుతున్నాడు అనే వార్త హల్ చల్ చేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు!

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న

Comments

comments