చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం

Chandrababu Naidu facing trouble time with Supreme Court Judgement

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో తెగ పరేషాన్ అవుతున్న బాబుకు సుప్రీంకోర్టు మరో ఝలక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో సాక్షాధారాలతోసహా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు న్యాయస్థానాల్లో మాత్రం స్టేలతో కాలంనెట్టుకువస్తున్నాడు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసి, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన ఓటుకు నోటు వ్యవహారం మీద ఏసీబీ స్పీడ్ పెంచాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు వెంటనే విచారణ వేగంవంతం చెయ్యాలని తీర్పిచ్చింది.

ఈ మొత్తం వ్యవహారంలో తనకు సంబందం లేదని, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబందంలేదని వాదిస్తూ చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎనిమిది వారాల స్టే విధించింది. కాగా తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ లో వచ్చిన తీర్పుపై మెలికపెట్టింది సుప్రీంకోర్టు.

చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను నాలుగు వారాల్లో పరిష్కరించాలని.. అలా కాని పక్షంలో మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కవచ్చు అని తీర్పును వెల్లడించింది. చంద్రబాబు నాయుడు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషరన్ ను పరిష్కరించాలని, లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుంటామని అన్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకు ఎందుకు చుక్కలు కనిపిస్తున్నాయి అంటే.. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ మీద స్పందించిన ఎనిమిది వారాలు స్టే విధించింది.. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఆ ఎనిమిది వారాల టైం కన్నా నాలుగు వారాలకు కుదించింది. ముందు నుండి ప్రతి కేసులో స్టేల ద్వారా కాలం నెట్టుకువచ్చే చంద్రబాబుకు ఇది ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే.

కాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించగా హైకోర్టు దానిపై స్టే విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల్లో కూడా హైకోర్టు వెల్లడించిన తీర్పు మీద ఎలాంటి ఆక్షేపణ చెయ్యలేదు. కానీ అదే ఎనిమది వారాల టైం ముగిసినా లేదంటే సుప్రీం కోర్టు విధించిన నాలుగు వారాల్లో ఎటూ తేల్చకపోయినా ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులోకి వెళుతుంది. అలా వెళితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఖచ్చితంగా ఇరుకునపడాల్సి వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతందో.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఓడినా విజేతనే.. భారత సింధూరం
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
స్థూపం కావాలి
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
నారా వారి అతి తెలివి
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
తిరిగిరాని లోకాలకు జయ

Comments

comments