అంతే బాబూ.. టైం అలాంటిది మరి!

Chandrababu Naidu facing troubles with his Eruvaka programmee

ఏపి సిఎం నారాచంద్రబాబు నాయుడు మీద అక్కడి ప్రతిపక్షం ఎంతలా చిందులు వేస్తోందో అందరికి తెలుసు. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి చిన్న పనిలో కూడా విమర్శల కోసం అవకాశాలను వెతుకుతోంది అక్కడ ప్రతిపక్షం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. ప్రభుత్వం నుండి., ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి తప్పులకు అవకాశం దొరుకుతుంది కాబట్టే ప్రతిపక్షాలు దానిపై విరుచుకుపడుతున్నాయి. అమరావతి సమీపంలోని అమర రామలింగేశ్వరస్వామి దేవాలయం భూముల స్వాహాపై ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అది సమిసింది కదా అనుకునేలోపు తాజాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏరువాక కార్యక్రమం మీద విమర్శల వర్షం కురుస్తోంది.

అదేంటి ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని స్వాగతించాలి కానీ ప్రతిపక్షం అన్నంత మాత్రాన ప్రతి విషఃయం మీద సాగదీయాలా.? విమర్శలు చెయ్యాలా అని అనుకుంటున్నారేమో.? విషయం వేరే ఉంది. చంద్రబాబు నాయుడు నిజంగా రైతులకు మంచి చేస్తే ఎవరు మాత్రం కాదంటారు.. కానీ చేసే విధానంలో చిత్తశుద్ది లేదు అనేది ప్రతిపక్షం ప్రధాన ఆరోపణ. ఎందుకంటే రైతు మార్క్ కోసం ఎంతో కాలంగా చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారు. కానీ ఆయన దానికి ఎందుకో సూట్ కావడం లేదు. గతంలో వైయస్ ను చూడండి.. ఆయన రైతుగా సూట్ అయ్యాడు. దీనికి కూడా కారణం ఉండవచ్చు. వైయస్ స్టైల్ పంచకట్టుతో ఉండటం వల్ల ఆయన రైతు బిడ్డ.. ఓ రైతు అనగానే అంతా ఓకే అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ నుండి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి.

అందరికంటే ముందు మీడియా వాళ్లకు చంద్రబాబు నాయుడు మాటలు బాగా కనెక్ట్ అయ్యాయి. కాబట్టే ఆయన ఎప్పుడు రైతులకు సంబందించిన కార్యక్రమం చేసినా కానీ వెంటనే గతంలో చంద్రబాబు అలా అన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఇలా అంటున్నారు అంటూ గతాన్ని తవ్వితీస్తున్నారు. వ్యవసాయం చెయ్యడం దండగ అనే ఓ స్టేట్ మెంట్ ను ఇప్పటికే ఎక్స్ పైరీ లేకుండా వాడుకుంటున్నారు మీడియా వాళ్లు. ఇప్పుడు తాజాగా నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో కూడా ఇదే వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. అంటే మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేశారు అని కాదు.. కానీ హైటెక్ బాబుగా ఉన్న చంద్రబాబు బూట్లు వేసుకొని తలపాగా కట్టుకుని.. వ్యవసాయం చేస్తుంటూ నవ్వొస్తోంది అన్న ప్రతిపక్షాల మాటల్లో వాస్తవం ఉంది.

తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఏరువాకలో భాగంగా భూమి పూజ నిర్వహించిన చంద్రబాబు రైతులా పొలం పనులు చేశారు. కానీ చాలా వరకు సోషల్ మీడియాలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు దీని మీద తీవ్రంగా విమర్శలు కురిపించాయి. రైతు అనే మార్క్ కోసం తపన పడితే ఇలాగే ఉంటుంది అని.. కాదు కాదు హైటెక్ వ్యవసాయం చేస్తున్నారు అని మరోలా కూడా కామెంట్లు చేస్తూ పక్కన వైయస్ఆర్ ఫోటోలు పెడుతున్నారు. పాపం.. బలం లేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లు విరగడం అంటే ఇదేనేమో..!

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
పంజా విసిరిన జననేత
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఏపి సిఎంగా నారా లోకేష్
ఓటుకు నోటు కేసును మూసేశారా?

Comments

comments