ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’

Chandrababu Naidu Fire On YCP For Filing Case

ఓటుకునోటు.. ప్రస్తుతం ఏపీలో బర్నింగ్ టాపిక్‌గా నడుస్తున్న ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు పీకల్లోతు కూరుకుపోయారు. గతకొన్నాళ్ళ క్రితం అసలు వినపించకుండాపోయిన ఈ పదం.. ఇప్పుడు బాబు సీఎం పదవికే ఎసరు పెట్టింది. ఇప్పటికే రాష్ట్రాన్ని అవినీతిపరంగా మొదటిస్థానంలో నిలబెట్టిన చెత్త సీఎంగా ఓ రికార్డ్‌ని నెత్తినబెట్టుకున్న సమయంలో.. ‘ఓటుకు నోటు’ చిక్కొచ్చి పడడంతో గొంతులో నీళ్ళు కూడా దిగడం కష్టంలా మారింది బాబుకి. సడెన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణా ఈ వ్యవహారాన్ని తెరమీదకి తేవడం, ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేయడంతో.. బాబుకు దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. తిరిగి కరెంట్ తెప్పించుకోవడం కోసం ఫ్యూజులు వెతుక్కుందామన్నా… ఇదివరకే అవి షార్టేజ్ అయిపోయాయి. పరిపాలన పక్కనపెట్టి.. తన సీటుకి ఎసరుపెట్టిన ఈ కేసు వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే.. ఇక్కడ బాబు మరోసారి తన తెలివిని బాగానే ఉపయోగించుకున్నారు. ఎప్పటిలాగే తన హైటెక్ మైండ్‌ని వినియోగించుకుని.. టెక్నికల్‌గా ఈ కేసుపై స్టే తెచ్చుకున్నారు. దీంతో.. తన మీద కేసులపై ‘స్టే’లు తెచ్చుకోవడంలో తాను సిద్ధహస్తుడని మరోసారి నిరూపించుకున్నారు. ఏదేమైనా.. ఈ కేసు ఆయనకు మళ్ళీ తలనొప్పిగా మారడంతో ఏం చేయాలో పాలుపోక.. ప్రత్యర్థి పార్టీమీద అగ్గిమీద గుగ్గిలమై విరుచుకుపడుతున్నారు. ఈ కేసుపై స్టేతో ఊరట తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు.. తనపై రామకృష్ణ చేసిన ప్రైవేట్ పిర్యాదుని ఒక రాజకీయ ప్రతీకార చర్య అని పేర్కొన్నారు. అదేవిధంగా.. తనని ప్రశ్నించడానికి ప్రయత్నం చేసిన సాక్షి విలేకర్లను ఉన్మాదులని అంటున్నారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?

Comments

comments