పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..

Chandrababu-naidu-on-Sakshi

తెలుగునాట రాజకీయాలు ముందు నుండి ఎంతో ఆసక్తికరమే. తాజాగా ఏపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య తగాదా.. మీడియా సంస్థ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓ వ్యక్తికి చెందిన మీడియా సంస్థ మీద గతకొంత కాలంగా వరుస ప్రకటనలతో హోరెత్తించిన ప్రభుత్వం ఆ పత్రికను, న్యూస్ ఛానల్ ను తొందరలోనే సొంతం చేసుకుంటాం అని ప్రకటించింది. ఈపాటికే ఆ మీడియా సంస్థ సాక్షి అని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థల మీద గతకొంత కాలంగా ప్రభుత్వం నుండి వస్తున్న హెచ్చరికలు కొత్త వివాదానికి, ఆసక్తికర అంశానికి తెర తీశాయి.

జగతి పబ్లికేషన్, ఇందిర బ్రాడ్ కాస్టింగ్ ను వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టాడు. అప్పుడు వాటిని ప్రారంభిస్తూ.. జగన్ చేసిన ప్రకటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సాక్షి అనే మీడియా ఏ వ్యక్తికి, వర్గానికి, పార్టీకి, ప్రాంతానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ పనిచెయ్యదు. స్వతంత్రంగా పనిచేసి మీడియా విలువలను మరింత పెంచుతుంది అని ప్రకటించారు. ఆ నాడు జగన్ చేసిన ప్రకటనను ఈనాటి పరిస్థితులకు అన్వయించుకుంటే ఎంతటి అబద్దపు మాటలో అర్థమవుతుంది. కానీ ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తించాలి… ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసినంత మాత్రాన అది తప్పు అని కాదు.. కానీ సాక్షిలో వచ్చే కథనాల్లో ఎన్ని, ఏ వ్యక్తికి అనుకూలంగా వస్తున్నాయి.. మరెన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి అన్న విషయాన్ని గమనిస్తే విషయం ఇట్లే అర్థమవుతోంది.

గతకొంత కాలంగా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఒకే ప్రకటనను మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు, డబ్బులతో సాక్షిని నడిపిస్తున్నారని.. ప్రభుత్వం వాటిని సొంతం చేసుకుంటుంది అని ప్రకటించారు. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షి మీడియాకు చెందిన అన్ని ఆస్తులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అటాచ్ చేసింది. మరోపక్క సిబిఐ కూడా జగన్ ఆస్తులకు సంబందించిన విషయాల మీద కేసు నమోదు చేసింది. ఈ తరుణంలో పదేపదే జగన్ మీడియా సంస్థలను ప్రభుత్వం సొంతం చేసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే అది ఎంత వరకు నిజమని జనాలు ఆలోచించాలి.

సాక్షి లాంటి మీడియాను మూసివెయ్యడం అంత సులభం కాదు. అందుకే టేకోవర్ అనే మాట వస్తోంది. ప్రభుత్వం టేకోవర్ చేసే పరిస్థితే వస్తే కనుక ఓ కన్సార్టియం లాంటి ఏర్పాటు ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. ఓ ఇండిపెండెంట్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్లే నడుపుతారు ఆ మీడియాని అని చెప్పే వీలు ఉండొచ్చేమో ! ఉద్యోగుల భవితవ్యం, జవాబుదారీతనం లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టే ఈ ఏర్పాటు. ఇలాంటివన్నీ జరగాలంటే దర్యాప్తు సంస్థల జోక్యంతోపాటు(సిబిఐ) ఆర్థిక వ్యవహారాలు చూసే విభాగాల(ఈడీ) తోడ్పాటు అన్నిటికీ మించి కేంద్రం సాయం కావాలి.మరి చంద్రబాబు ఆ మేరకు కేంద్రం నుండి అనుమతలు తీసుకువచ్చి.. సాక్షిని చేతిలోకి తీసుకోవడం అంత సులభమైతే కాదు.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
ఇదే జగ‘నిజం’
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
ఎవరు చాణిక్యులు..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ప్రత్యేక హోదా లాభాలు
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఇక యుద్ధమే కానీ..
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

Comments

comments